Home

»

Tv News

Godhavari : సింహాద్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జానూ.. ఆ డైరీలో ఏముంది?

Jul 19, 2026 9:44AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -60 లో....సూర్యకి జానూ ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. మరొక వైపు గౌతమికి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. మీ అక్క పెళ్లి అయింది కదా స్వీట్ ఇవ్వవా అని అడుగుతాడు. ఇస్తానని గౌతమి చెప్తుంది. ముందు ఒక ముద్దు ఇవ్వు అంటాడు. గౌతమి సిగ్గుపడుతుంది. నువ్వు ఎలాగైనా మా కాలేజీలో జాయిన్ అవ్వు అని కళ్యాణ్ చెప్తాడు. సరే అని గౌతమి అంటుంది. నువ్వు జాయిన్ అయ్యాక నీ సంగతి చెప్తానని కళ్యాణ్ అనుకుంటాడు. నందు నిద్రపోతుంది.. తననే చూస్తూ పడుకుంటాడు మురళి. 

మరుసటి రోజు ఉదయం నందు స్నానం చేసి కిచెన్ లోకి వెళ్లి టీ పెడుతుంటే అప్పుడే పెద్దావిడ వచ్చి.. ఏంటి రాత్రి నీ మొగుడు మీద కోపం పోయిందా అని అడుగుతుంది. దాంతో తనపై నందు కోప్పడుతుంది. ఆ తర్వాత నందు ఇక్కడ ఉన్నావేంటి మురళికి ఈ బ్రష్, వేడి నీళ్లు ఇవ్వమని అంటుంది. నేను ఎందుకు ఇవ్వాలని నందు అడుగుతుంది. మురళి ఈ ఇంటికి అల్లుడు.. ఇప్పుడు తనకి గౌరవం ఇవ్వాలని శారద అంటుంది. దాంతో నందు అవన్నీ పట్టుకొని కోపంగా వెళ్లి మురళిని నిద్రలేపి స్నానం చేసి రమ్మని చెప్తుంది. ఆ తర్వాత సింహాద్రి తోటని మంచి ధరకి అమ్ముతాడు. అందుకు కొంత డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకుంటాడు. మరొకవైపు శంకర్ ఫ్రెండ్ దుబాయ్ నుంచి వస్తాడు. దారిలో శంకర్ వాళ్ళ ఇంటి అడ్రెస్ కోసం అతడు సూర్యని అడ్రెస్ అడుగుతాడు. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని సూర్య అతన్ని బండిపై ఎక్కుంచుకొని వాళ్ళ ఇంటికి బయల్దేర్తాడు. ఆ తర్వాత సింహాద్రి దగ్గరికి తన భార్య వచ్చి ఆ తోట అమ్ముకొని అంత లాభం పొందారు కదా వాళ్ళకి కొంచెం డబ్బు ఇవ్వొచ్చు కదా అని అనగానే తనపై కోప్పడి లోపలికి పంపిస్తాడు సింహాద్రి.

మరొకవైపు నందు వచ్చి టిఫిన్ చేస్తుంటే ఏంటే ఒక్కదానివే వచ్చావ్.. నీ మొగుడు ఎక్కడ అని పెద్దావిడ అడుగుతుంది. అప్పుడే మురళి డోర్ దగ్గర నిల్చొని నేను టిఫిన్ లోపలే చేస్తానని అంటాడు. ఏమైంది బావ అని జానూ అతన్ని బయటకు తీసుకొని వస్తుంది. లూస్ షర్ట్ లూసు లుంగీతో మురళి ఇబ్బంది పడుతుంటే అందరు నవ్వుతారు. తరువాయి భాగంలో దుబాయ్ నుంచి శంకర్ ఫ్రెండ్ వస్తాడు. శంకర్ కి అప్పులు ఉండడం ఏంటి.. ఆయనే ఎంతోమందికి అప్పు ఇచ్చాడని చెప్తాడు. ఒకరేమో ఊరంతా అప్పులు చేసారని చెప్తున్నారు.. ఒకరేమో అప్పులేదు అంటున్నారని జానూ అంటుంటే అంటే ఇప్పుడు సింహాద్రి అన్నయ్య ని అంటున్నావా అని శారద అనగానే అవునని జానూ అంటుంది. సింహాద్రి కూడా అక్కడే ఉంటాడు. ఈ డైరీలో మీ నాన్న ప్రతి ఒక్క రూపాయి రాసేవాడు అని అతను ఇస్తాడు. దాంతో సింహాద్రి టెన్షన్ పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com