Home

»

Tv News

యాంకరింగ్ చేయగలనా లేదా అని భయమేసింది ... ప్రదీప్ ఎమోషనల్

Aug 4, 2026 12:15PM

ప్రదీప్ మాచిరాజు బుల్లి తెర మీద కనిపించే ఫన్నీ యాంకర్. ఎలాంటి వారినైనా నవ్వించే టాలెంట్ ఇతని సొంతం. గతంలో అన్ని షోస్ కి మాగ్జిమమ్ ఇతనే హోస్ట్ గా ఉండేవాడు. ఐతే ఒక లెగ్ సర్జరీ వలన అతను కొన్నాళ్ళు యాంకరింగ్ కి దూరమయ్యాడు. ఇండస్ట్రీని టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న యాంకర్స్ లో ప్రదీప్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఫీమేల్ యాంకర్స్ చాలా మంది ఉన్నారు కానీ మేల్ యాంకర్స్ లో ప్రదీప్ , సుధీర్ తప్పా ఇంకెవరూ లేరు. ఐతే కొంతకాలంగా ఇండస్ట్రీలో ఏదో ఒక కారణాల వలన హాస్పిటలైజ్ అవుతున్నారు చాలా మంది. అంటే యాక్సిడెంట్స్ కారణంగా చాలామంది బాధపడ్డారు. పాగల్ పవిత్రకి కార్ యాక్సిడెంట్ అయ్యింది. తర్వాత శ్రీవాణి - విక్రమాదిత్య వాళ్ళ కార్ కూడా యాక్సిడెంట్ కి గురై శ్రీవాణికి సర్జరీ అయ్యింది. అలాగే రీసెంట్ గా డాన్స్ మాష్టర్ పండు యాక్సిడెంట్ కారణంగా ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యాడు. అలాగే ప్రదీప్ కూడా.

అందులో ప్రదీప్ కొంతకాలంగా యాంకరింగ్ కి దూరమైన విషయం తెలిసిందే. ఆ విషయాన్నే ప్రదీప్ రీసెంట్ గా రిలీజయిన శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రోమోలో చెప్పాడు. తన లెగ్ ఇంజ్యురితో చాలా రోజులు తట్టుకోలేని బాధను అనుభవించినట్లు చెప్పుకొచ్చాడు. తన జీవితంలో అవే చీకటి రోజులు అన్నట్టుగా ఆవేదన చెందాడు. "ఒక చిన్న యాక్సిడెంట్ వలన షూట్ లో నాకు లెగ్ సర్జరీ అయ్యింది. నాకు ఇంకా గుర్తే నేను ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నప్పుడు నాకు 50 - 50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నట్టు డాక్టర్ చెప్పారు. కంప్లీట్ గా ఫిట్ గా నడవగలుగుతారా లేదా అనేది చెప్పలేకపోయారు. అప్పటికే డిసైడ్ చేసుకున్నా కూర్చుని చేసేవి ఏమేం ఉన్నాయా అని ఆలోచించుకున్నా. యాంకరింగ్ కూర్చుని చేసేయొచ్చా. లేదా ఇంకేదైనా చేయొచ్చా అని ఫిజికల్ గా ఎంత లేచి రావాలన్నా లేచి రాలేని పరిస్థితి వచ్చింది. నిజంగా అవి నాకు చాలా పెయిన్ ఫుల్ డేస్" అని చెప్పొచ్చు అంటూ ప్రదీప్ బాధపడ్డాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com