హిమజ జరిపిన 'హాయ్ సామ్' వన్ ఇయర్ సెలెబ్రేషన్స్
on Jun 29, 2022
హిమజ ఇటు స్మాల్ స్క్రీన్ మీద, అటు బిగ్ స్క్రీన్ మీద అందరికీ పరిచయమే. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. 'నేను శైలజ', 'శతమానంభవతి', 'వరుడు కావలెను' వంటి మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ చేసి మంచి ఇమేజీని సంపాదించుకుంది. కామెడీ రోల్స్ తో పాటు సీరియస్ రోల్స్ లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది. ఇటీవల హిమజ, తన మిత్రుడు సంపత్ కలిసి "హాయ్ సామ్" పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు.
ఇప్పుడు ఆ ఛానల్ పెట్టి వన్ ఇయర్ ఐన సందర్భంగా సూపర్ గా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. హిమజ పేరులో హాయ్, సంపత్ పేరులో సామ్ రెండు కలిపి ఛానల్ కి పేరు పెట్టామని చెప్పుకొచ్చింది. హిమజ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వన్ ఇయర్ సెలబ్రేషన్ కి జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ, శ్రీవాణి ఫ్యామిలీ, అమృత ప్రణయ్, రోహిణి, రవికృష్ణ అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మిత్రులంతా కలిసి మస్త్ దావత్ కూడా చేసుకున్నారు. బయట నుంచి నాన్ వెజ్ ఫుడ్ అన్ని రకాలు ఆర్డర్ చేసి తెప్పించుకుని బాగా ఖుషి చేశారు.
హిమజ గురించి అందరూ చక్కగా మాట్లాడారు. బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి హిమజ ఆటిట్యూడ్ లో కానీ, మెంటాలిటీలో కానీ ఎలాంటి మార్పూ లేదని, మొదటి నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉందని మిత్రులంతా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. "జ" అనే మూవీలో ప్రతాప్ రాజ్ తో కలిసి నటించింది హిమజ. పెళ్లి, విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో హిమజని ఒకప్పుడు బాగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.