సుమ డాన్స్ నేర్పిస్తే ఇలా ఉంటుంది!
on Jun 29, 2022
సుమ ఎప్పుడూ చిన్నపిల్లలా ఎంతో అల్లరి చేస్తూ ఉంటుంది. ఎలాంటి షోనైనా చాలా ఈజీగా హ్యాండిల్ చేసే టాలెంట్ ఆమెకే సొంతం. స్టార్స్ కూడా వాళ్ళ షోస్ కి సుమనే హోస్ట్ గా తీసుకుంటారు. ఇక సుమ సోషల్ మీడియాలో కూడా ఫాన్స్ కోసం వీడియోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అవి చాలా ఫన్నీగా ఉంటాయి. ఇటీవల ఆమె ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. అందులో తన స్టాఫ్ పర్సన్స్ లో ఒకరైన గీత అనే ఆమెకు సుమ డాన్స్ స్టెప్ ఒకటి నేర్పిస్తుంటుంది. ఆమె అది చేయడానికి ట్రై చేస్తుంది కానీ మళ్ళీ ఆమె తన దారిన తాను నడుచుకుంటూ వెళ్ళిపోతుంది.
ఐతే సుమ "గీత తన స్టైల్ లో తాను చేస్తోంది" అంటూ కాప్షన్ పెట్టి ఆ వీడియో పోస్ట్ చేసింది. "ఏదైనా ట్రెండింగ్ సాంగ్ కి మీరు మీ ఫ్రెండ్స్ తో కానీ స్టాఫ్ తో కానీ కలిసి డాన్స్ చేయడానికి ట్రై చేశారా? ఇది చాలా ఫన్నీ! అలా చేసిన వారుంటే కింద కామెంట్స్ లో చెప్పండి" అని పోస్ట్ చేసింది.
సుమ తన స్టాఫ్ తో కలిసి డాన్స్ చేసే ఫొటోస్ షేర్ చేసింది. ఒక ప్రోగ్రాంకి వెళ్లిన సుమ వేదిక మీద ఒక గ్రూప్ డాన్స్ చేస్తూ ఉంటే వెనకవైపు గ్రీన్ రూమ్ లో సుమ, ఆమె సిబ్బంది కలిసి చేసిన డాన్స్ వీడియోను "బ్యాక్ స్టేజి ఎంటర్టైన్మెంట్" అనే కాప్షన్ తో పోస్ట్ చేసింది. ఇటీవల 'జయమ్మ పంచాయతీ' మూవీతో వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది సుమ.
క్యాష్ ప్రోగ్రాంతో న్యూ ట్రెండ్ క్రియేట్ చేసి మరింత పాపులర్ అయ్యింది. అలాగే సుమ ఇటీవల ఒక అవార్డు అందుకున్నారు కూడా. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తాను చేసిన సేవలకు గాను న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్ షిప్ మేయర్ సామ్ జోషి చేతులమీదుగా "ప్రొక్లమేషన్" పేరుతో ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. యూఎస్ లో అతి పిన్న వయస్కుడైన మేయర్, అలాగే భారత సంతతికి చెందిన మొదటి మేయర్ నుంచి ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషం.