శ్రీముఖి తనకు కాబోయే భర్త గురించి ఏమి చెప్పిదంటే?
on Oct 3, 2025
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ అచ్చంగా #singles పేరుతో తీసుకొచ్చారు. ఇక ఇందులో గుప్పెడంత మనసు రిషి సర్, ఆరియానా, అన్షు రెడ్డి, రోహిణి, శ్రీకర్ కృష్ణ, అర్జున్ కళ్యాణ్, భానుశ్రీ వంటి వాళ్లంతా ఈ ఎపిసోడ్ లో ఉన్నారు. అబ్బాయిలు తమకు ఎలాంటి అబ్బాయిలు కావాలో అమ్మాయిలు తమకు ఎలాంటి అబ్బాయిలో కావాలో చెప్పుకుంటూ ఉంటే బ్యాక్ స్క్రీన్ మీద వాళ్ళ వాళ్ళ ఫొటోస్ వస్తూ ఉన్నాయి. ఇక శ్రీముఖి తనకు కాబోయే అబ్బాయి ఎలా ఉండాలో చెప్పింది. "నాకన్నా హైట్ కొంచెం పెద్దగా ఉన్న అబ్బాయి కావాలి." ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఒక అబ్బాయి ఫోటో వచ్చింది. దాంతో శ్రీముఖి "గర్ల్స్ నాకు సిగ్గేస్తోంది. మీరు మీ బావను చూస్తున్నారా" అంటూ ముఖం అరచేతుల్లో దాచుకుని తెగ సిగ్గుపడిపోయింది.
"ఈ మధ్య నేను కొంచెం స్పిరిట్యుయల్ ఐపోయాను. నాతో పాటు గిరి ప్రదక్షిణలు చేసేవాడు కావాలయ్యా. ఓ మై గాడ్ షో మీ మై పిల్లల డాడ్. రారా రాజా" అని తెగ అరుస్తూ సందడి చేసింది. ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద ఎక్స్ప్రెస్ హరి ఫుల్ ఫోటో పడింది. అంతే శ్రీముఖి, హరి, రోహిణి స్టేజి మీద ఉన్న వాళ్లంతా షాకయ్యారు. ఇక "బావొచ్చాడోయమ్మా బావొచ్చాడు" అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యింది. ఇక స్టేజి మీద నుంచి శ్రీముఖి పారిపోతూ కిందకి వచ్చేసింది. ఇక హరి అని తెలిసేసరికి శ్రీముఖి మళ్ళీ స్టేజి మీదకు వచ్చి ఏడుస్తూ కూర్చుంది. వెంటనే హరి పక్కకొచ్చి "అమ్మగారు నిజంగా మీ మనసులో నేనున్నానా" అని ఆశ్చర్యంతో అడిగాడు. దాంతో శ్రీముఖి ఇంకా గొంతు పెంచేసి "నాకు అన్యాయం జరిగిపోయిందక్కో" అంటూ శోకాండాలు పెట్టింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



