.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -76 లో..... గౌతమి ఇంకా ఇంటికి రాలేదని శారదా టెన్షన్ పడుతుంది. సూర్య,, జానూ ఒకవైపు నందు, మురళి ఒకవైపు గౌతమి గురించి వెతుకుతారు. ఎక్కడ తను కనిపించకపోవడంతో జానూకి టెన్షన్ మొదలవుతుంది.. సింహాద్రి అన్నమాటలు గుర్తుచేసుకొని ఇంకా టెన్షన్ పడుతుంది. కచ్చితంగా ఇది ఆ సింహాద్రి పనే.. నీకు చెల్లెలు ఉన్నారు జాగ్రత్త అన్నాడు వాడిని వెంటనే అడిగి నిలదియ్యాలని జాను అంటుంది. సూర్య, జాను, నందు, మురళి వెళ్తారు.
మరొకవైపు ఇంకా కళ్యాణ్ ఇంటికి రాలేదని సింహాద్రితో అరుణ చెప్తుంది. వాడు ఇంట్లో ఉండి ఏం చేస్తాడు. ఎంజాయ్ చేయనివ్వని సింహాద్రి అంటాడు. సింహాద్రి బయటకురా అని జాను గట్టిగా అరుస్తుంది. నా చెల్లి కన్పించడం లేదు. నువ్వే ఏదో ఒకటి చేసావని జాను అంటుంది. నాకేం తెలుసని సింహాద్రి అంటాడు. గౌతమి కళ్యాణ్ ఫ్రెండ్స్ అని జాను అంటుంది. అత్తయ్య కళ్యాణ్ ని పిలువమని సూర్య అంటాడు. ఇంకా రాలేదు.. సూర్య ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని అరుణ చెప్తుంది.
అన్ని చెప్తున్నావని అరుణపై కోప్పడి లోపలికి వెళ్ళమంటాడు. మీరు అనవసరంగా గొడవ చెయ్యకండి అని చెప్పేసి సింహాద్రి వెళ్ళిపోతాడు. సూర్య తన ఫ్రెండ్ అయిన పోలీస్ కి ఒక నెంబర్ స్విచాఫ్ వస్తుంది లొకేషన్ ట్రేస్ చెయ్యాలని సూర్య చెప్పగానే అతను ట్రేస్ చేసి లొకేషన్ పంపిస్తాడు. లొకేషన్ పట్టుకొని వీళ్ళు బయల్దేరతారు. మరొకవైపు గౌతమిని కళ్యాణ్ ఫామ్ హౌస్ కి తీసుకొని వెళ్తాడు. మా నాన్న లేడు.. తోట పత్రాలు లేవు.. అబద్ధం చెప్పాను.. నన్ను అందరిలో కొట్టి అవమానించావ్ కదా ఇప్పుడు నీ పరువు తోయ్యబోతున్నానని కళ్యాణ్ అనగానే గౌతమి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇక గౌతమిని కళ్యాణ్ ఆపి తనపై చెయ్ వేస్తాడు. దాంతో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంటుంది గౌతమి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
