.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-340 లో...... జయకి గంగా వార్నింగ్ ఇస్తుంది. నిన్ను ఈ ఇంటికి కోడలు అసలు అవనివ్వనని గంగ అంటుంది. ఆ తర్వాత జయ ఇంకా గంగ ఇద్దరు తోటికోడళ్ళుగా బాగుంటారని లక్ష్మితో సుధా అంటుంది. అప్పుడే విశ్వ వస్తాడు. జయ ఎక్కడ అని అడుగుతాడు. తన అత్తగారింటికి వెళ్ళిందని సుధా చెప్తుంది.
అప్పుడే అంతా అయిపోయిందని ఫిక్స్ అయ్యారా అని విశ్వ అంటాడు. ఎంగేజ్మెంట్ అయింది కదా అని సుధా అంటుంది. అయినంత మాత్రాన పెళ్లి వరకు వెళ్తుందని చెప్పలేం కదా.. అయినా నా పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు వెళ్ళిందని విశ్వ అంటాడు. అప్పుడే జయ వస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిస్తే వాళ్ళతో ఎలా ఉండాలని తెలుస్తుందని వెళ్ళానని జయ అంటుంది అప్పుడే సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టావా అని విశ్వ అంటాడు. ఆ తర్వాత గంగ, రుద్ర దగ్గరికి రంగా వస్తాడు. ఆ రంగనాథం అడ్రెస్ దొరికిందని రంగా చెప్తాడు. ముగ్గురు కలిసి బయల్దేరతారు. మరొకవైపు శకుంతల షాపింగ్ చేసి బయటకు వస్తుంది. అప్పుడే సుధా అక్కడికి వెళ్తుంది. వదిన చాలా థాంక్స్ పెళ్లికి ఒప్పుకున్నందుకు అని సుధా అంటుంది. నువ్వు చేసిన మోసం ఎలా మర్చిపోతానని శకుంతల కోప్పడుతుంది.
ఆ తర్వాత రంగనాథం దగ్గరికి వీరు వెళ్లి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎలాగైనా నిజం చెప్తానని రంగనాథం అంటాడు. దాంతో అతన్ని చంపెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే రుద్ర, గంగ, రంగా అందరు రంగనాథం గారు అంటూ డోర్ కొడతారు. రంగా లోపలికి వెళ్లి చూస్తే ఎవరు ఉండరు. తరువాయి భాగంలో వీరు నుంచి రంగనాథం తప్పించుకొని వెళ్తాడు. మళ్ళీ వీరు పట్టుకుంటాడు. ఆల్రెడీ రుద్ర వస్తున్నాడని రంగనాథం చెప్తాడు. అంతలోనే రంగనాథంకి ఆక్సిడెంట్ అవుతుంది. అక్కడికి శకుంతల వస్తుంది. విశ్వ కూతురు జయ కాదు గంగ అన్న విషయం చెప్పి అతను చనిపోతాడు. ఆ నిజం తెలిసి శకుంతల షాక్ అవుతుంది. శకుంతల అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే రుద్ర వాళ్ళు వస్తారు. ఈ పెద్దాయన ఆ కార్ లో వెళ్తున్న అమ్మగారికి ఏదో చెప్పాడు అనీ అక్కడున్న వాళ్లంతా అనడంతో అటువైపు చూస్తారు.అది శకుంతల కార్ అని రంగా అంటాడు. అంటే ఏదో విషయం అమ్మగారికి చెప్పాడు అన్నమాట అని గంగ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
