Home

»

Tv News

Godavari: మేనమామ ఇల్లు నాదేనంటూ శాంత నోరు మూయించిన జాను!

Jun 21, 2026 12:36PM

 

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-36 లో..  జానూ, నందు, శారద అంతా కలిసి వర్షంలో తడుస్తూ రోడ్డు పక్కన ఉన్న చెట్టు కిందకి వెళ్తారు. అక్కడ ఒక పరదా కప్పుకొని తలదాచుకుంటారు. అదంతా సింహాద్రి చూస్తాడు.. తోట, డాక్యుమెంట్లు అంటూ ఆరాతీస్తావా.. ఇప్పుడు చూసావా ఉండటానికి ఇల్లే లేకుండా చేశానంటూ జానూ గురించి సింహాద్రి అనుకుంటాడు. ఆ తర్వాత అందరు వర్షంలో తడుస్తుంటే వాళ్ళని వెతుక్కుంటూ సూర్య, మురళి వస్తారు. అయ్యో జానూ, నందు, అత్త సారీ.. ఈ రోజు నేను ఊళ్ళో లేను‌. మెటీరియల్ కోసం టౌన్ కి వెళ్ళాను.. ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మురళి అంటాడు. నా ఫోన్ మా అమ్మ చేతిలో ఉంది.. సారీ జానూ అని సూర్య అంటాడు‌.

పదండి మా ఇంటికి వెళదామని మరళి అనగానే వద్దని నందు అంటుంది. ఎందుకని అడుగగా మీ అమ్మ మమ్మల్ని తిట్టేస్తుంది.. మా నాన్న చనిపోతే కూడా రాలేదు.. ఇక మమ్మల్ని ఇంటికి రానివ్వదు.‌ మేమంతా వస్తే మమ్మల్ని తిడుతుందని నందు అంటుంది. అయితే మా ఇంటికి రండి.. మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు అని సూర్య అనగానే వద్దు నేను ఫోన్ చేస్తేనే మీ అమ్మ ఉందని లిఫ్ట్ చేయలేదు.. ఇక మేమంతా వస్తామంటే మీ అమ్మ ఒప్పుకోదు.. మేము రోడ్డుపై ఇబ్బందులు పడ్డా పర్వాలేదు కానీ మా వాళ్ళ  నువ్వు ఇబ్బంది పడకూడదని సూర్యతో జాను అంటుంది. ఇక మురళి ఇంటికి వెళదామని అంటే నందు వద్దని అంటుంది. నా కూతురు బాధలో అలా అందే, ఏం అనదు పదండి వెళదామని నందు వాళ్ళ నానమ్మ అంటుంది. ఇక జానూ అందరిని కన్విన్స్ చేస్తుంది. సంబంధం వద్దనుకున్నారనే బాధలో అలా అందే తప్ప.‌‌. రక్త సంభంధాన్ని వద్దనుకుంటుందా అని మురళి అందరిని తీసుకెళ్తాడు.

ఇక ఇంటికి వెళ్ళాక ఎందుకు తీసుకొచ్చావ్ వీళ్ళందరిని అని మురళి వాళ్ళ అమ్మ శాంతా అడుగుతుంది. ఇక మరళి జరిగిందంతా చెప్తాడు. ఏంటి ఇప్పుడు వీళ్ళంతా మన ఇంట్లో ఉంటారా.. ఇదేమైనా సత్రమా.. అయినా నా తమ్ముడు చనిపోగానే మీతో నాకు సంబంధం తెగిపోయిందని శాంతా అంటుంది. ఇక శాంతా వాళ్ళ అమ్మ బ్రతిమిలాడుతుంది. మొన్న అయిపోయారు.. ఈ రోజు ఇల్లు పోయింది.. మేం ఏం చేయాలని నందు, జాను వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. ఇక నందుని శాంతా ఇష్టమొచ్చినట్టు తిడుతుంది. ఇక జానూ మధ్యలో ఎంటర్ అవుతుంది. ఏంటి అత్తా.. ఇప్పుడు మేం ఉండకూడదు ఈ ఇంట్లో అంతేనా అని అనగానే అవునని శాంతా అంటుంది. అయితే మీరు కూడా ఉండకూడదు.. ఎందుకంటే మా మేనమామ ఇంటికి రావడానికి మాకు సర్వహక్కులున్నాయి.. నీకు నచ్చినా నచ్చకపోయినా మేం ఇక్కడే ఉంటామని అనగానే శాంతా ఏం మాట్లాడలేకపోతుంది. ఇక కిన్నెర, నందు, వాళ్ళ అమ్మని, నానమ్మలని జాను లోపలికి తీసుకెళ్తుంది.  మరుసటి రోజు జానూ, సూర్య, మురళి ఒక దగ్గర మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే ఒక బాల్ నేరుగా జాను ముఖం మీదకి వస్తుంది . దానిని జానూ క్యాచ్ పడుతుంది‌.‌ ఇక క్రికెట్ ఆడుదామని జాను అమగానే మరళి, సూర్య షాక్ అవుతారు. నువ్వు బాల్ వెయ్.. అది నా సమస్య.. దాన్ని నేను ఎంత బలంగా కొట్టగలనో చూస్తానని జానూ అంటుంది.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com