Home

»

Tv News

Jayam serial : గంగే సొంత కూతురని నిజం చెప్పేయాలనుకున్న పైడిరాజు.. రుద్ర వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి?

Jun 21, 2026 12:29PM

 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -300 లో.... పైడిరాజు, లక్ష్మి ఇద్దరిని ఇక పని మానెయ్యండి మేం వెళ్తున్నామని వాళ్ళకి డబ్బు ఇస్తాడు. సుధా డల్ గా ఉండడం తో సుధడ ఇక్కడ నుంచి దూరంగా వస్తానని మాటిచ్చావని విశ్వ అంటాడు. వాళ్ళు వెళ్లిపోతున్న విషయం గంగకి లక్ష్మి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో గంగ ఆ విషయం రుద్రకి చెప్తుంది. వాళ్ళని ఆపడానికి రుద్ర బయల్దేరతాడు. మరొకవైపు ఆ విషయం వెంటనే వీరు ఇషికలకి జయ ఫోన్ చేసి చెప్తుంది.

ఇప్పుడు ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతేనే మా నాన్నకి నేను కూతురు కాదన్న డౌట్ పోతుందని జయ అంటుంది. అలా వెళ్తేనే ప్రాబ్లమ్.. ఇప్పుడు వెళ్లకుండా ఆపమని వీరు అంటాడు. మరొకవైపు పెద్దసారు యోగా చేస్తుంటే శకుంతల వస్తుంది. మీ చెల్లి ఊరువదిలి వెళ్ళిపోతుందని శకుంతల అంటుంది. ఆ విషయం నాకు తెలుసని పెద్దసారు అంటాడు.. నా చెల్లిని వెళ్లకుండా ఆపడానికి తన మేనల్లుడు రుద్ర ఉన్నాడు కదా.. రుద్ర వెళ్ళాడని పెద్దసారు అంటాడు. ఆ మాటలు వీరు, ఇషిక విని నీలాగే మావయ్యకి కూడా రుద్ర బావ అంటే చాలా నమ్మకం ఉందని వీరుతో ఇషిక అంటుంది.

మరొకవైపు విశ్వ నిర్ణయంలో మార్పు ఉండదని పైడిరాజు, లక్ష్మీ కలిసి గంగనే సొంతకూతురు అని చెప్పాలని నిర్ణయం తీసుకొని వెళ్తారు. అయ్యగారు మీకొక విషయం చెప్పాలని చెప్పబోతుంటే అప్పుడే రుద్ర వస్తాడు. మమ్మల్ని ఆపడానికి వచ్చావా అని విశ్వ అనగానే లేదు మావయ్య సెండాఫ్ ఇవ్వడానికి వచ్చానని రుద్ర అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇంకా బ్యాగ్ లు లోపల పెట్టలేదా నేను పెడతానని లాగేజ్ కార్ లో పెడతాడు. రుద్ర వాళ్ళని ఆపుతున్నాడా అని రంగాకి పెద్దసారు ఫోన్ చేస్తాడు. లేదు లగేజ్ కార్ లో పెడుతున్నాడని రంగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com