Home

»

Tv News

Podharillu : చక్రి-కేశవ గొడవకు మహా బ్రేక్.. భార్య కోసం క్రేజీ సర్ ప్రైజ్!

Jun 18, 2026 10:15AM

స్టార్ మా టీవీలో  ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -138 లో.. చక్రి, కేశవ గొడవపడుతుంటే మహా ఎంత ఆపమని చెప్పిన ఆపకపోయేసరికి ప్లేట్ తెచ్చి గట్టిగా విసిరేస్తుంది. అప్పుడే మాధవ వచ్చి.. ఇక్కడ ఏం జరుగుతుందని కోప్పడతాడు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది. తన ముందు గొడవ పడవద్దన్న జ్ఞానం కూడా లేదని మాధవ కోప్పడతాడు. అతను డబ్బు నీ కోసమే కదా తీసింది.. ఎందుకు అంత గొడవ అని చక్రిపై మహా కోప్పడుతుంది. దాంతో చక్రి కోపంగా వెళ్తాడు. నా పెంపకం ఇలా ఉందా అని మాధవ బాధపడుతాడు.

ఆ తర్వాత చక్రి డ్రింక్ చెయ్యాలని వెళ్తాడు. అక్కడ నారాయణ కన్పిస్తాడు. దాంతో మళ్ళీ వచ్చేస్తాడు. ఆ తర్వాత చక్రి నీకంటే పెద్దవాడు కదా ఎందుకు ఒక మాట అంటే పడలేవా అని మాధవ అంటాడు. మహాకి కేశవ సారీ చెప్తాడు. ఇది తొంబై తొమ్మిది.. ఇలా మీరు గొడవపడ్డ ప్రతీసారి నాకు సారీ చెప్పడమని మహా అంటుంది. ఇక మీరు గొడవ పెట్టుకోమని నాకు అగ్రిమెంట్ రాసివ్వండి అని మహా అనగానే అంత నమ్మకం లేదా అని చక్రి అంటాడు. ఆ తర్వాత చక్రి బయట ఉంటాడు. కేశవ వెళ్లి మాట్లాడుతాడు తనకి  స్కూటీ అన్నావ్ కదరా ఒక స్కూటీ వచ్చింది.. ఆ అమ్మాయి అమెరికా వెళ్తుందంట.. అందుకే అమ్ముతున్నారని కేశవ అంటాడు. సరే రేపు ఒకసారి చూద్దామని చక్రి అంటాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. వాళ్లని మహా వాళ్ళు చూసి ఇందాక గొడవ పడింది వీళ్లేనా అనుకుంటుంది. ఆ తర్వాత కేశవకి శైలు మిస్డ్ కాల్ ఇస్తుంది. మళ్ళీ కేశవ ఫోన్ చేస్తుంటే కట్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత మరుసటి రోజు  ఉదయం చక్రి స్కూటీ కోసం త్వరగా లేచి కేశవని లేపుతాడు. ఇద్దరు కలిసి షాప్ కి వెళ్తారు. అక్కడికి ఒకతను స్కూటీ తీసుకొని వస్తాడు. అది చూసి బానే ఉంది కానీ రేట్ ఎక్కువ అని తగ్గించమని రిక్వెస్ట్ చేస్తారు. తరువాయి భాగంలో మహాకి స్కూటీ తెచ్చి సర్ ప్రైజ్ ఇస్తారు. ఆ తర్వాత నువ్వు స్కూటీ తెచ్చావ్.. కానీ నువ్వు నేర్పించడం వద్ద భర్తగా ముందు అమ్మాయి మనసులో స్థానం సంపాదించమని చక్రితో నారాయణ అంటాడు. ఆ తర్వాత మహాకి కన్నా స్కూటీ నేర్పిస్తుంటే.. నేను నేర్పుతానంటూ చక్రి వెళ్తాడు. మహా వెనకాల కూర్చొని ఈ రకంగా అయినా తనకి దగ్గర కావచ్చని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com