.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -297 లో..... జయ తన కూతురు కాదన్న డౌట్ విశ్వలో ఉంటుంది. దాంతో తను చిన్నప్పుడు పాపని అప్పగించిన అతను సీతారామ్ ని పిలిపిస్తాడు. జయ గురించి అడుగుతాడు. ఎక్కడ ఆ పాపని వదిలేసావ్ చూపించమని అడుగుతాడు. ఆ పాపని అనాధ ఆశ్రమంలో ఉంచానని అతను అనగానే సరే ఎక్కడో చూపించమని విశ్వ అతను బయల్దేరతారు.
మరొకవైపు రుద్రకి జయ వాళ్ళ కూతురు కాదన్న విషయం డౌట్ వచ్చి రంగాని తీసుకొని వెళ్లి అమ్మ ఒడి ఆశ్రమానికి వెళ్లి ఎంక్వయిరీ చేస్తాడు. అసలు ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు.. ఎవరు తీసుకొని వెళ్ళలేదని అక్కడ వాళ్ళు చెప్పడంతో జయ ప్లాన్ ప్రకారం వచ్చింది. అసలు తను సుధా అత్తయ్య కూతురు కాదన్న విషయం రుద్రకి అర్థమవుతుంది. విషయం వెంటనే అత్తయ్య, మావయ్యలకి చెప్పాలని అనుకుంటాడు. అప్పుడే గంగ ఫోన్ చేస్తుంది. తనకి విషయం చెప్పి త్వరగా అత్తయ్య ఇంటికి రమ్మని చెప్తాడు. మరొకవైపు జయకి వీరు విషం బాటిల్ ఇచ్చి ఇది విషం కాదు.. ఇది తాగినట్లు యాక్టింగ్ చెయ్.. ఇక నీ మీద ఎవరు డౌట్ పడరు అని వీరు చెప్తాడు. జయ వెళ్ళాక అది నిజమైన విషం.. అది పోయిన పర్వాలేదని ఇషికతో వీరు అంటాడు. ఆమ్మో.. బ్రోతో జాగ్రత్తగా ఉండాలని ఇషిక మనసులో అనుకుంటుంది.
మరొకవైపు అనాధ ఆశ్రమానికి సీతారాం , విశ్వ వెళ్తారు. రుద్ర, రంగా విశ్వ ఇంటికి వెళ్తారు. అత్తయ్య నువ్వు ముందు జయని పిలువు.. ఒక విషయం చెప్పాలని రుద్ర అంటాడు. నేను పిలుస్తానని లక్ష్మీ వెళ్తుంది. అప్పుడే గంగ కూడా అక్కడికి వస్తుంది. ఇంటి ముందు ఇషిక, వీరు కార్ లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
