ఆర్జీవీ ట్వీట్ తో షన్నుకు కౌంటరిచ్చిందా?
on Jan 18, 2022
రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద ట్వీట్ లతో ప్రతీ ఒక్కరినీ గిల్లుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన పెట్టిన, పెడుతున్న ట్వీట్ లు వివాదాల్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయన పెట్టిన ట్వీట్లని కొంత మంది తమకు నచ్చినట్టుగా వాడుకుంటూ కొంత మందికి కౌంటర్లుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. నిన్న రాత్రి, ఈ రోజు ఉదయం వర్మ పెట్టిన ట్వీట్ లు నెట్టింట వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బన్నీని మెగాస్టార్ గా అభివర్ణిస్తూ మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే తాజాగా వర్మ చేసిన ఓ పోస్ట్ ని తనకు అనుకూలంగా మార్చుకుంది దీప్తి సునయన. `మనుషులంతా కూడా అబద్దాలనే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అవి నిజాలకంటే ఎంతో కంఫర్ట్ గా వుంటాయి. నిజం బట్టలు విప్పి అందరినీ నగ్నంగా నిలబెడుతుంది. అబద్దాలు వాటిని కవర్ చేస్తుంటాయి` అంటూ మనుషుల మనస్తత్వంపై ఫిలాసఫీకల్ గా వర్మ ట్వీట్ చేశాడు. అదే ట్వీట్ ని దీప్తి సునయన తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది.
ఈ పోస్ట్ సునయన షన్నుని ఉద్దేశించి తన ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసినట్టుగా వుందని, షన్నుకి కావాలనే కౌంటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే సునయన ఇలా చేసిందని నెటిజన్ లు సెటైర్లు వేస్తున్నారు. కానీ షన్ను మాత్రం దీప్తితో కలిసిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అతని ఫాదర్ కూడా దీప్తి, షన్ను కలుస్తారని చెబుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
