.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -727 లో..... జ్యోత్స్న పోటీలో ఆలస్యం చేస్తుంటే ఈ పోటీలో గెలవడం ఇప్పుడు నా కంటే ఎక్కువ నీకే అవసరమని దీప అంటుంది. నా కంటే ఎక్కువ ఇప్పుడు నిన్ను గుర్తిస్తారు.. శివన్నారాయణని తన మనవరాలు గెలిపించిందని అనుకుంటారు. నువ్వు నాతో చేతులు కలుపమని మాటివ్వమని దీప అనగానే జ్యోత్స్న మాటిస్తుంది. ఎవరిని ఎవరితో జత చెయ్యాలో నాకు బాగా తెలుసని సూరజ్ అనుకుంటాడు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి పోటీలో చాలా తొందరగా వంటలు చేస్తారు. జడ్జెస్ వచ్చి DM రెస్టారెంట్ ఇంకా జ్యోత్స్న రెస్టారెంట్ కి సంబంధించిన వంటలు రుచి చూస్తారు. ఇద్దరివి బాగున్నాయని చెప్తారు. కానీ ఇద్దరిలో జ్యోత్స్న రెస్టారెంట్ వాళ్ళు చేసిన ఫుడ్ ఇంకొంచెం టేస్డీగా ఉందని వాళ్ళు చెప్తారు. దాంతో శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరిముందు ఈ గెలుపుకి కారణం జ్యోత్స్న అని దీప చెప్తుంది. ఇద్దరు కలిసి అవార్డు అందుకుంటారు. జ్యోత్స్న అవార్డు శివన్నారాయణకి ఇస్తుంది. ఇద్దరిని చూసి శివన్నారాయణ ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. శివన్నారాయణతో దక్షిణామూర్తి తను చేసిన ఛాలెంజ్ ని గుర్తుచేసుకొని మొహం చెల్లక వెళ్లిపోతుంటే శివన్నారాయణ ఆపి కౌంటర్ వేస్తాడు. మాలిని దక్షిణామూర్తి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కంగ్రాట్స్ అని జ్యోత్స్నకి సూరజ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. నువ్వు నన్ను మోసం చేసావని జ్యోత్స్న అంటుంది. నన్ను కాదు ఆ దీపని గెలిపించావని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. జ్యోత్స్న, దీపలకి దిష్టి తియ్యమని సుమిత్రకి శివన్నారాయణ చెప్తాడు. సుమిత్ర దిష్టి తీస్తుంది. ఇద్దరిని శివన్నారాయణ మెచ్చుకుంటాడు. ఇప్పుడు మీకు పార్టీ ఏర్పాటు చేసానని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏంటే నువ్వు ఆ దీపతో చేతులు కలిపావని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. దాంతో సూరజ్ వంక జ్యోత్స్న కోపంగా చూస్తుంది. జ్యోత్స్న బయటకు వస్తుంది. తన వెనకాలే సూరజ్ వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు మీ తాత నీతో ప్రేమగా ఉంటున్నాడు. దానికి కారణం నేనే అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
