.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1089 లో.... రాజుని ఇంటికి తీసుకొని వెళ్లాలని ఇందు విశ్వప్రయత్నం చేస్తుంది. రాజు కోసం ఇంటి ముందు ధర్నా చేస్తుంది. మొగుడి మొండితనం నశించాలని నినాదాలు చేస్తుంది. తనతో పాటు చలపతి, లక్ష్మి కూడా ఉంటారు. ఏంటి మీరు దాంతో కలిసి కొడుకుని రోడ్డుకి ఈడుస్తున్నారని రాజు అంటాడు. మాకు ఇద్దరు సమానమే అని చలపతి అంటాడు. అప్పుడే అక్కడ ఉండే ఆడవాళ్లు వచ్చి ఇందుకి సపోర్ట్ చేస్తారు. వాడు అంతే అమ్మ కొడుకు.. పెద్ద కోపిష్టి.. నిన్ను ఏమైనా అంటున్నాడా బాగా చూసుకోవడం లేదా అని అడుగుతారు.
ఇందు నవ్వుకుంటుంది. అలా అందరు రాజుకి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎలాగోలా రాజు వాళ్ళని అక్కడ నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత కాసేపు అక్కడ ఉండే మగవాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా ఇందుకి సపోర్ట్ గా మాట్లాడుతారు. ఇప్పటికైనా నాతో వస్తారా అని ఇందు అడుగుతుంది. ఇక రాక చస్తానా అని రాజు చిరాకుపడతాడు. వెంటనే రాజుకి బ్యాగ్ తీసుకొని వచ్చి ఇస్తారు. కొంచెం ఆగండిరా ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వట్లేదని రాజు అంటాడు. ఆటో వచ్చేవరకు అయినా ఆగండి అని రాజు అనగానే ఆటో వచ్చేసింది అంటు ఆటో తీసుకొని వెంకీ వస్తాడు. ఒరేయ్ నువ్వు కూడా ఏంట్రా అని రాజు అంటాడు. అమ్మానాన్నలు నువ్వు లేకపోతే ఫీల్ అవుతారన్నావ్ కదా.. ఇప్పుడు ఏంట్రా నన్ను పంపిస్తున్నావని రాజు అనగానే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కదా అని వెంకీ అంటాడు..
ఆ తర్వాత అందరు రాజుని అత్తగారింటికి సాగానంపుతారు. అత్తయ్య, మావయ్య వెళ్ళొస్తానని ఇందు అందరికి చెప్తుంది. తరువాయి భాగంలో రాజుని తీసుకొని ఇందు ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత దుగ్గిరాల ఇంటికి లక్కీని తీసుకొని రాజు వస్తాడు. ఇక నుంచి లక్కీ గాడు ఈ ఇంట్లో నే ఉంటాడని రాజు చెప్తాడు. వద్దు అని భ్రమరాంబ అంటుంది. అప్పుడేపై నుంచి రేఖ వస్తుంటే పిన్ని వీడు మన లక్కీనే అని రాజు అనగానే రేఖ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

