Home

»

Tv News

హెవెన్ అండ్ హెల్ కాన్సెప్ట్‌తో నవ్వుల పంట!

Jun 9, 2026 11:59AM

 

కుక్కు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే నవ్వులే నవ్వులు. హెవెన్ అండ్ హెల్ కాన్సెప్ట్ తో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ థీమ్ రాబోతోంది. ఒక్కొక్కొళ్ళు ఒక్కో గెటప్ లో వచ్చారు. "హెవెన్ మీట్స్  హెల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ " అంటూ చెప్పాడు ప్రదీప్. హెల్లో - హెవెనో కానీ అందాల రాక్షలు ఇక్కడే ఉన్నారు అంటూ సంజయ్ తుమ్మ అటు శ్రీదేవిని ఇటు ముచ్చెర్ల అరుణ గారిని కలిపి అనేసారు. యాదమ్మ రాజు యముడి గెటప్ లో వచ్చాడు. ఆర్జే హేమంత్ రేలంగి మావయ్య గెటప్ లో వచ్చాడు. యముడు యాదమ్మ రాజును చూసి "అందరూ ఇక్కడ ఆనందంగా ఉన్నారు.

ఆయన మాత్రం కొంచెం వైల్డ్ గా ఉన్నారు ఎవరాయన " అని అడిగాడు. "ఈసారి ఎంటర్టైన్మెంట్ చేయకపోతే మిమ్మల్ని తీసుకుపోతా నేను " అంటూ యముడు రేలంగి మావయ్యను బెదిరించాడు. అవినాష్ అరుంధతి మూవీలోని పశుపతి గెటప్ లో పుర్రెను తీసుకుకుని  వచ్చాడు. ఇక మణికంఠ ఐతే ఆమ్మో బొమ్మ మూవీలో బొమ్మ గెటప్ లో చేతిలో ఒక ఎముకను తీసుకుని వచ్చాడు. అది కాస్తా జారిపోయేసరికి రోహిణి ఆ పుర్రెను పట్టుకుని "స్పూన్ ఇవ్వండి ఐస్ క్రీం తింటా " అంటూ కామెడీ చేసింది.

దాంతో అవినాష్ కి కోపం వచ్చి "25  ఏళ్ళ నుంచి నిన్ను సమాధిలో కుళ్ళబెట్టానే " అన్నాడు. పక్కనే ఉన్న మణికంఠ "అందుకే గబ్బు వాసన వస్తోంది " అంటూ కౌంటర్ ఇచ్చాడు.  రోహిణి ఊర్వశి గెటప్ లో వచ్చింది. "నేను ఊర్వశిని " అని చెప్పి తానే నవ్వుకునే సరికి "జోక్ వేసుకుని మీరే నవ్వుకుంటారేంటి " అన్నాడు ప్రదీప్. "స్వర్గం ఎలా ఉంటది ఉంటది అని మానవులంతా ఉర్రూతలూగుతున్నారు " అని రోహిణి అనేసరికి "వాట్ ది హెల్ " అంటూ యముడు యాదమ్మ రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో రోహిణి షాకయ్యింది

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com