.webp)
టీవిలో వచ్చే వాతావరణ సూచన అంటే 80 స్ , 90 స్ లో ఒక ఎమోషన్ . వాన పడే సూచన ఉంది అనగానే ముందే అందరూ అలెర్ట్ ఐపోయేవాళ్లు. న్యూస్ రీడర్ టీవీ స్క్రీన్ మీద వాతారణం మేఘాలు అవన్నీ చూపిస్తూ చెప్పడం ఇప్పటికీ చాలామందికి గుర్తే. అలాంటి ఒక కాన్సెప్ట్ ని శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ లో పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ లో మాహేష్ ఆచంట న్యూస్ రీడర్ గెటప్ లో వచ్చాడు. ఆదికి న్యూస్ రీడర్ కి మధ్యన ఒక వాన కన్వర్జేషన్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. "హలో న్యూస్ రీడర్ గారేనా అండి" అని ఆది ఫోన్ చేసాడు.
.webp)
"ఆ న్యూస్ రీడర్ నే చెప్పు " అన్నాడు మహేష్ . "సర్ మా ఊళ్ళో రాళ్ళ వర్షం ఏమన్నా పడిద్దా అండి" అని అడిగాడు ఆది. "ఎందుకు"అన్నాడు న్యూస్ రీడర్. "మా నాన్నగారు ఒక నాలుగు రాళ్లు వెనకేసుకోమన్నారండి. అందుకే వెనకేసుకుందామని " అని ఆది చెప్పేసరికి మహేష్ షాకైపోయాడు. "వర్షం పడితే పడింది గాని ఒక రెండు ఆపగలరా వర్షాన్ని" అని అడిగాడు మళ్ళీ ఆది. "ఏ ఎం చెత్తావ్" అన్నాడు న్యూస్ రీడర్. "మా ఆవిడ వడియాలు ఆరేసింది" అన్నాడు ఆది.
దాంతో మళ్ళీ షాకయ్యాడు మహేష్. తర్వాత పండు లైన్ లోకి వచ్చాడు. "సర్ న్యూస్ రిపోర్టరా సర్ " అని ఫోన్ చేసాడు. "అవును " అని మహేష్ అనేసరికి "ఉందా " అని పండు అడిగాడు. "ఏంటది " అన్నాడు న్యూస్ రిపోర్టర్. "అదే సర్ ఉందా" అని మళ్ళీ అడిగాడు పండు. "ఏంటది..ఏముందరా " అన్నాడు మహేష్ కోపంగా. "వర్షం పడితే కరువు పోద్ది అన్నారు కదా ..అదే ఉందా " అన్నాడు పండు మళ్ళీ. ఇలా వాన కాన్సెప్ట్ అందరినీ అలరించబోతోంది.




.webp)
.webp)
