Home

»

Tv News

Brahmamudi : రాజును చంపేందుకు రేఖ కుట్ర.. అసలు నిజం తెలుసుకున్న ఇందు!

Jul 14, 2026 9:51AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1083 లో..... లక్కీని రాజు కలుస్తాడు. నువ్వు ఇన్నాళ్లుగా మీ అమ్మ కోసం చూస్తున్నావ్ కదా తన గురించి తెలిసిందని రాజు చెప్పగానే లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ ఎవరు అని లక్కీ ఎక్సైట్ మెంట్ తో అడుగుతాడు. మీ అమ్మ గురించి నేను ఎందుకు చెప్పడం మీ అమ్మే స్వయంగా వచ్చి చెప్తుందని రాజు చెప్పగానే లక్కీ పట్టరాని సంతోషంతో ఉంటాడు. ఆ తర్వాత రాజు పక్కకి వచ్చి రేఖకి ఫోన్ చేస్తాడు. ఇక్కడ లక్కీ మీ కోసం వెయిట్ చేస్తున్నాడు.. మీరు ఇంకా రాలేదని నేనే చేసాను పిన్ని అని రాజు అంటాడు.

అంటే లక్కీకి నిజం చెప్పవా అని రేఖ అడుగుతుంది. లేదు మీ నోటితో మీరే చెప్తారని చెప్పలేదని రాజు చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రేఖ దగ్గరికి భ్రమరాంబ, ఐశ్వర్య వచ్చి నువ్వు ఇంట్లో ఏం జరిగినా పట్టించుకోవడం లేదని అడుగుతారు. మీరు ఏం భయపడకండి ఆ రాజు గాడికి చావు భయం అంటే చూపిస్తానని రేఖ అంటుంది. ఆ మాటలు అన్ని స్వాతి విని ఇందుకి వెళ్లి చెప్తుంది. దాంతో ఇందు టెన్షన్ పడుతూ రాజుకి ఫోన్ చేస్తుంది. రాజు లిఫ్ట్ చెయ్యకపోయేసరికి చలపతికి ఫోన్ చేస్తుంది ఇందు. అంకుల్ రాజు ఎక్కడ ఉన్నాడు.. తన ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్తుంది. దాంతో చలపతి భయపడుతాడు. ఆ తర్వాత రౌడీలతో రాజుని చంపాలని చూస్తుంది రేఖ. రౌడీ వెహికల్ తో రాజుని ఆక్సిడెంట్ చేస్తాడు. దాంతో రాజుని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. రాజుని ఆ పరిస్థితిలో చూసి చలపతి, లక్ష్మి ఏడుస్తారు.

అప్పుడే ఇందు వస్తుంది. ఎలా ఉన్నాడని ఇందు అడుగుతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్.. ఇక్కడ నుంచి వెళ్ళిపో.. రాజు నీ మొగుడని రేఖ ఇలా చేసింది.. ఇంకా ఆ ఇంటికి వారసుడు అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చలపతి అనగానే ఇందు షాక్ అవుతుంది. ఏంటి అంకుల్ మీరు అనేది అని ఇందు అడుగుతుంది. దాంతో జరిగింది మొత్తం చలపతి చెప్తాడు. అతను మీ అత్తకొడుకు అన్న నిజం చెప్తాడు. దాంతో ఇందు షాక్ అవుతుంది. తరువాయి భాగంలో నా బావ బాగుండాలని ఇందు దేవుడికి మొక్కుకుంటుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చలపతి అనగానే నా బావని నా ఇంటికి తీసుకొని వెళ్తానని ఇందు చెప్పగానే చలపతి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com