Home

»

Tv News

Godhavari : నందు పెళ్లి మంటపంలో ఊహించని ట్విస్ట్.. మురళితో వివాహం!

Jul 14, 2026 9:54AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -55 లో.....పెళ్లి కొడుకు పెద్ద ఫ్రాడ్ అని జానూ అందరికి చెప్తుంది. బాబు మీ నాన్న ఎవరు అని జానూ ఆ బాబుని అడుగగా మా నాన్న అతనే అని పెళ్లికొడుకుని చూపిస్తాడు.. దాంతో అందరు షాక్ అవుతారు. వీడు NRI అని చెప్పి ఇంతముందే పెళ్లి చేసుకున్నాడని జానూ చెప్తుంది. నువ్వు చెప్పకపోతే ఇప్పుడే పోలీసులకి అప్పగిస్తానని పెళ్లి కొడుకుతో సూర్య అంటాడు. దాంతో అబ్బాయి నిజం ఒప్పుకుంటాడు. ఎక్కడ సింహాద్రి పేరు చెప్తాడోననే భయంతో ఎందుకు మా ఫ్రెండ్ కూతురిని ఇంత మోసం చేసారని వాళ్ళ మీద సింహాద్రి కోప్పడతాడు. వాళ్ళని కొట్టి అక్కడి నుండి పంపిస్తాడు.

అలా వదిలేసారేంటి పోలీసులకి అప్పగించాలి కదా అని అక్కడున్న వాళ్ళు అంటారు. పోలీసులు వస్తే నందు భవిష్యత్తు ఏమవుతుందని సింహాద్రి అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళు పెళ్లి ఆగిపోయింది మళ్ళీ ఎవరు చేసుకుంటారని అంటారు. అవన్నీ మాటలు విని శారద ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇక దీనికి అమెరికా సంబంధం వద్దు వచ్చినా తోట అడుగుతారు. అదంతా మన వల్ల కాదు.. ఇప్పుడే దీని పెళ్లి జరగాలి అని శారద అనగానే అదేంటీ అమ్మ ఇప్పుడు పెళ్లి జరగడం ఏంటని జానూ అంటుంది. నా ఆడపడుచు కొడుకున్నాడు కదా మురళి.. తనకి జానూకి పెళ్లి అని శారద అనగానే నేను చేసుకోనని నందు అంటుంది. ఇప్పుడు నా మాట వినకపోతే నేను ఉండనని చనిపోతానని శారద లోపలికి వెళ్లి గడియ పెట్టుకుంటుంది.

దాంతో అందరు తన వెనకాలే వెళ్లి డోర్ తియ్యమని అంటారు. డోర్ పగులగొట్టి లోపలికి వెళ్తారు. నా మాట వినట్లేదు ఏం చెయ్యాలి.. తన వెనకాల ఇంకా ముగ్గురు కూతుళ్లున్నారు.. వాళ్ళ పెళ్లి ఎలా చెయ్యాలని శారద ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో నందుని మురళి పెళ్లి చేసుకుంటాడు. ఇంటికి తీసుకొని వస్తే.. శాంతి ఆ పెళ్లిని అంగీకరించదు. నందు మెడలో తాళిని శాంతి తియ్యబోతుంటే మురళి ఆపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com