
సుమ అడ్డా షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి బులెట్ భాస్కర్, ఫైమా, నూకరాజు, చలాకి చంటి, వర్ష, ఆటో రాంప్రసాద్ వచ్చారు. ఇక వర్ష రాగానే సుమ మీద సెటైర్ వేసింది. "ఇది సుమక్క చేస్తోంది కాబట్టి ఇది సుమ అడ్డా అదే నేను చేస్తే " అని వర్ష అనేసరికి "ఇందిరానగర్ గడ్డ " అంటూ నూకరాజు కౌంటర్ ఇచ్చాడు. "ఇక్కడ ఎవరు కామెడీ చేసినా నూకానే కామెడీ చేయాలి ఎందుకంటే వాడు నూకా నూకా " అంటూ చలాకి చంటి అన్నాడు. తర్వాత సుమ "పొదుపు" అంది. "ఇది అస్సలు చేయరు" అని రాంప్రసాద్ అనేసరికి "మీ ఆవిడకు ఉండేది అదే" అంది సుమా. "మా ఆవిడకు లేదు కాబట్టే అప్పులైపోయాను ఈరోజు" అన్నాడు రాంప్రసాద్. తర్వాత ఒక టాస్క్ లో ఫ్రీ బస్సు అని కనిపించేసరికి చలాకి చంటి నోరు జారబోయాడు వెంటనే పక్కనే ఉన్న బులెట్ భాస్కర్ చంటి నోరు మూసేసాడు. "వద్దొద్దు దాని గురించి మాట్లాడొద్దు " అన్నాడు భాస్కర్.
ఈ ప్రోమో లాస్ట్ లో ఆదిత్య 369 కాన్సెప్ట్ లాంటిది సుమ 369 పేరుతో ఒక సెగ్మెంట్ నిర్వహించింది. "మీ పాస్ట్ నుంచి ఏదైనా ఇన్సిడెంట్ ని మార్చుకోవాలి అనుకుంటే మీరు దేన్నీ మార్చుకుంటారు." అని సుమ అడిగింది. "ఆ టైంకి వెళ్ళాలి అనుకుంటే మా అమ్మకు జరిగిన యాక్సిడెంట్ నాకు ముందే తెలిసుంటే ఆపేసేవాడిని. ఫైర్ యాక్సిడెంట్ లో మా అమ్మ చనిపోయింది. అప్పటికి నా వయసు 6 ఏళ్ళు. కళ్ళ ముందే మనిషి కాలిపోవడం అంటే కొంచెం కష్టం కదా. పట్టి గుంజి లాగి కాపాడ్డం అనేది తెలీని వయసు కదా" అని చెప్పాడు చలాకి చంటి. తర్వాత వర్ష ఎమోషనల్ అయ్యింది. "ఇంకో జన్మ అంటూ ఉంటే ఆడపిల్లగా పుట్టకూడదు. ఈ ముఖం వెనక నా మనసులో చాల బాధ , చాల కష్టం ఉందక్కా. మళ్ళీ జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఆడపిల్లగా పుట్టొద్దు అసలు ఈ జన్మే నాకు వద్దు అని కోరుకుంటాను " అని ఏడుస్తూ చెప్పింది వర్షా. వెంటనే ఆమె బాధ చూడలేక సుమ, బులెట్ భాస్కర్ వెళ్లి ఓదార్చారు.






