స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1076 లో..... రాజు దగ్గరికి ఇందు వస్తుంది. మీ వాళ్ళని బాధపెట్టి నిన్ను ఇక్కడ ఉంచలేను..వెళ్ళిపోమని రాజుతో ఇందు అంటుంది. నేను వెళ్ళనని రాజు అంటాడు. నిన్ను రప్పించిన నేనే చెప్తున్నాను వెళ్ళిపో అని ఇందు అంటుంది. మన మధ్య ఉన్న బంధం ఇంతేనా అని రాజు అనగానే ఇందు ఆశ్చర్యంగా చూస్తుంది. అదే ఒప్పందం అని రాజు అంటాడు. నేనే వద్దని అంటున్నానని ఇందు అంటుంది. మీ వాళ్ళు చాలా మంచివాళ్ళు అలాంటివాళ్ళని బాధపెట్టడం ఇష్టం లేదని ఇందు అంటుంది.
నా కుటుంబం గురించి మర్చిపోమని రాజు అంటుంటే మరి నువ్వు నా కుటుంబం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావ్ ఆలోచించకు.. వెళ్ళిపోమని ఇందు చాల కఠినంగా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు కమర్షియల్ అంటావ్ కదా ఇదిగో డబ్బు తీసుకొని వెళ్ళిపోమని ఇందు చెప్తుంది. అంటే నేను మోసగాడిని అనుకున్నావా అని తన డబ్బు తనకి ఇచ్చి రాజు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు.ఆ తర్వాత రాజు ఇంట్లోకి వెళ్తుంటే చలపతి ఆపుతాడు. ఆ ఇంట్లో వాళ్ళతో ఇక ఏ సంబంధం పెట్టుకోనని చెప్తేనే లోపలకు వెళ్ళమను లక్ష్మి అని చలపతి అంటాడు. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటని రాజు అడుగుతాడు. గొప్పింటి వాళ్లే నా ప్రాబ్లమ్ అని చలపతి చెప్తాడు. నువ్వు అమ్మని వదిలేసి రమ్మంటే వస్తావా.. నేను కూడా అంతే అక్కడ నుంచి రాలేకపోతున్నాను.. ఏదో శక్తి నన్ను ఆపుతుందని రాజు చెప్తాడు. అక్కడ వాళ్ళకి నా అవసరం ఉంది.. నేను లేకపోతే అక్కడ ఏమైపోతారో అన్న భయం వేస్తుందని రాజు అంటాడు.
నీ అంతట నువ్వే ఆ ఇంటికి పంపే వరకు వెళ్ళనని చలపతితో రాజు చెప్పి లోపలకు వెళ్తాడు. మరొకవైపు అపర్ణ భోజనానికి సిద్ధం చేసి రాజుని తీసుకొని రా ఇందు అంటుంది. లేడు వెళ్ళిపోయాడు.. పంపించేసానని ఇందు చెప్తుంది. దాంతో అపర్ణ షాక్ అవుతుంది. తరువాయి భాగంలో నువ్వు ఇంటికి వచ్చేయ్ అని రాజుతో అపర్ణ ఫోన్ లో మాట్లాడుతుంది. ఆ తర్వాత రాజుకి డ్రింక్ పోసి తాగమని లక్కీ చెప్తాడు. రాజు తాగనని అనగానే ఎందుకురా అలా చేస్తున్నావ్.. తనేం నీకు సొంత పెళ్ళాం కాదు కదా అని లక్కీ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Brahmamudi Serial, Brahmamudi Serial Latest Episode, Brahmamudi Telugu Serial, Star Maa Serials, Brahmamudi Serial Today Episode




