
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1189 లో.. ఇందు సంతకం చేయలేదని భోజనం చేయకుండా అలిగిన ఐశ్వర్యకు ఇందు భోజనం తీసుకెళ్తుంటే రాజు వద్దని ఆపుతాడు. సంతకం కోసం కడుపులో బిడ్డను కూడా లెక్క చేయకుండా పంతం పట్టడం కరెక్ట్ కాదని రాజు కోప్పడతాడు. ఇంటి దగ్గర లక్కీ ఇందుని ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేస్తాడు. ఒక ప్రాణం విలువ తనకు తెలుసని బాధపడతాడు.
ఆ తర్వాత రాజు, ప్రశాంత్ ఎక్స్‌పోలో స్టాల్ రెడీ చేస్తుంటారు. అక్కడికి ఐశ్వర్య వస్తుంది. ఎంట్రీ డీటెయిల్స్ అడిగితే ఐశ్వర్య కోప్పడుతుంది. ఇందు సంతకం చేసిన పేపర్స్ చూపిస్తే, నిర్వాహకులు రాజుని పిలిచి ఇవి ఒరిజినల్లేనా అని అడుగుతారు. రాజుకి విషయం తెలియక ఇవి ఒరిజినల్ కావని చెప్పేస్తాడు. దీంతో నిర్వాహకులు ఐశ్వర్యను బయటకు తోసేస్తారు.
ఐశ్వర్య కింద పడబోతుంటే ఇందు వచ్చి పట్టుకుంటుంది. ఆ సంతకం తానే చేశానని చెప్పడంతో నిర్వాహకులు సారీ చెప్పి ఎంట్రీ ఇప్పిస్తారు. లోపలికి వెళ్లిన ఐశ్వర్య.. రాజు, ఇందులను తిడుతుంది. అసలు సంతకం ఎందుకు పెట్టావని రాజు అడిగితే, లక్కీ రిక్వెస్ట్ తోనే తను సంతకం చేసినట్లు ఇందు చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
[Brahmamudi Serial, Star Maa, Deepika Rangaraju, Maanas Nagulapalli]




.webp)
