Bigg boss 9 Telugu :బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా శివాజీ.. ఈసారి మాములుగా ఉండదుగా!
on Sep 13, 2025
.webp)
బిగ్ బాస్ లో ప్రతీ వీక్ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం అనేది పక్కా.. హౌస్ నుండి బయటకు వచ్చాక హౌస్ లో అనుభవాలని గురించి కొంచెం ఘాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. అదే బిగ్ బాస్ బజ్.... ఇప్పటివరకు బజ్ కి హోస్ట్ గా ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఎవరైతే ముక్కు సూటిగా బోల్డ్ గా మాట్లాడతారో బిగ్ బాస్ టీమ్ వాళ్ళనే సెలక్ట్ చేస్తుంది. గత సీజన్ కి అంబటి అర్జున్ చెయ్యగా ఈసారి ఎవరనేది చాలా రోజులా నుండి బిగ్ బాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు.
అయితే అందరికి ఊరటనిచ్చేలా స్టార్ మా ఒక ప్రోమో వదిలింది. ఈ సారి బిగ్ బాస్ కి బజ్ కి హోస్ట్ గా మన శివాజీ గారు చేయబోతున్నారు. హౌస్ లో శివాజీ మాటతీరు ఆల్రెడీ చూసేసాం.. ఒక హోస్ట్ గా అయితే ఇదే మొదటిసారి.ఎదుటివారిది తప్పుంటే చెంపదెబ్బ కొట్టినట్లు ఆయన మాట ఉంటుంది. మరి హోస్ట్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పలేం
తాజాగా వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటూ శివాజీ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే పనివల్ల ఆడియన్స్ లో తమ ఇమేజ్ మారుతూ ఉంటుంది. ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక అతను రైటో రాంగో డిసైడ్ చేద్దాం.. అయితే ఈ సారి బజ్.. అంటూ ముగించేశాడు శివాజీ. ఇక కంటెస్టెంట్స్ కి చుక్కలే మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



