ఆఫ్టర్ సిక్స్ మేమిద్దరం చిల్ అవుతాం!
on Apr 20, 2025
బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి చేసిన హడావిడి కానీ ఇచ్చిన కంటెంట్ కానీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆమె చుట్టూ ఎన్నో రూమర్స్ తిరిగాయి. ఐతే రీసెంట్ గా యష్మి ఒక ఇంటర్వ్యూలో తన తాగుడు గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
"ఆఫ్టర్ సిక్స్ అనే నా డైలాగ్ ఒక షో ద్వారా బాగా హైలైట్ అయ్యింది. ఆఫ్టర్ సిక్స్ చిల్ అవుతాం నేను, సత్య. అలా అని రోజూ నేను తాగుతానని కాదు. నేను తాగడం నేర్చుకుంది రెండు మూడేళ్ళ నుంచి . డిప్రెషన్ లో ఉన్నప్పుడు తాగుతాను తప్ప.. డైలీ బేసిస్ లో ఐతే తాగను. ఆఫ్టర్ సిక్స్ తర్వాత యష్మి ఏ బార్ లోనో టేబుల్ మీద ఒక గ్లాస్ పెట్టుకుని కూర్చుంటుంది అని మాత్రం అనుకోకండి. తాగుతాను కానీ లిమిట్ లో తాగుతాను. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక నా సర్కిల్ మొత్తం మారిపోయింది. కానీ నేను డిప్రెషన్ లో ఉన్నానని మాత్రం అనుకోకండి.. నేను హ్యాపీగా ఉన్నాను. బిగ్ బాస్ అంటేనే బోర్ కొట్టేసింది. బిగ్ బాస్ హౌస్ మళ్ళీ నెలా రెండు నెలలు ఉండాలి అంటే నా వల్ల కాదు. అస్సలు వెళ్లాలని నాకైతే లేదు. ఒకవేళ వెళ్ళాలి అంటే యష్మిని చూడరు..మాస్క్ వేసుకున్న యష్మిని మాత్రమే చూస్తారు. మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి..చూస్తున్నా..కన్నడలో ఒక సీరియల్ చేయించారు. కానీ తర్వాత వాళ్ళే ఆ సీరియల్ నుంచి నన్ను క్విట్ చేయించారు. తర్వాత వేరే సీరియల్ లో ఛాన్స్ ఇస్తాం అన్నారు. ఐతే ఆ ఫస్ట్ రోజు షూట్ లో మాత్రం కొత్త ఫేస్ కావాలి అన్నారు. అలాంటి టైములో నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది. అలా తెలుగులోనే బిజీ ఐపోయాను" అని చెప్పింది యష్మి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
