Home

»

Tv News

Bigg boss 9 Telugu : ఒక్క గుడ్డు తెచ్చిన తంటా..సంజన యాక్టింగ్ మాములుగా లేదుగా!

Sep 11, 2025 11:00AM


 

బిగ్ బాస్ సీజన్-9 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. నామినేషన్ అనంతరం హౌస్ మొత్తాన్ని అతలాకుతలం చేసిన ఏకైక కంటెస్టెంట్ సంజన. ఇన్ని సీజన్ లో ఇలాంటి కంటెస్టెంట్స్ ని ఎవరు చూసి ఉండరనేంతగా తన యాక్టింగ్ పర్ఫామెన్స్  ఉంది. ఓనర్స్ ని అడగకుండా రెంటర్స్ ఎవరు ఏది తీసుకోకూడదు.. అలాగే వాళ్ళ పర్మిషన్ లేకుండా కనీసం ఇంట్లోకి వెళ్లొద్దు..  ఇలా కొన్ని బిగ్ బాస్ రూల్స్ ఉన్నాయి.. కానీ సంజన రూల్స్ బ్రేక్ చేసింది.

ఫస్ట్ ఓనర్స్ ని సంజన కప్ కాఫీ అడిగింది. వాళ్ళు ఇవ్వమని చెప్పారు.. ఇలా ఇస్తే అందరు అడుగుతారు ఇవ్వమని మనీష్, ప్రియ అంటారు. ఆ తర్వాత ప్రియ గుడ్లు లెక్కపెడుతుంది. అందులో ఒకటి మిస్ అవుతుంది. ఎవరు తిన్నారని రెంటర్స్ ని ప్రియ అడుగుతుంది. ఎవరిని అడిగినా మేమ్ తినలేదని అంటారు.  నేను తిన్నానని రాముతో సంజన చెప్తుంది. కాసేపు చూసి నేను తినలేదని చెప్తానని రీతూతో సంజన అంటుంది. అసలు మిమ్మల్ని హౌస్ లోకి రమ్మని చెప్పడం తప్పైందని మనీష్, ప్రియా రెంటర్స్ పై కోప్పడుతారు. నీ ఒక్కదాని వల్ల మాకు అందరికి శిక్ష అని భరణితో పాటు మిగతా వాళ్ళు సంజనపై అరుస్తారు. సంజన మాత్రం ఏం పట్టనట్టు కూల్ గా కూర్చొని ఉంటుంది.

తనే తింది అని ఓనర్స్ తో చెప్తాడు రాము. నువ్వు తినడం ఎవరు చూసారని ప్రియ వాళ్ళు సంజనని అడుగగా.. తనూజ, భరణి, శ్రష్టి చూసారని సంజన చెప్తుంది. అంటే ఇప్పటివరకు అడిగాం.. ఎవరు తిన్నారని ఎవరు చెప్పాలేదని రెంటర్స్ పై ఓనర్స్ కోప్పడతారు. మధ్యలో ఈ టాపిక్ గురించి హరీష్, భరణికి మధ్య పెద్ద గొడవ అవుతుంది. ఆ తర్వాత సంజనపై రీతూ చౌదరి కోప్పడుతుంది. చివరికి సంజన ఏడుస్తూ అందరి నోళ్లు మూతపడేలా చేసింది. ఇలా సంజన తన నటన అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ కంటెస్టెంట్స్ అందరికి చుక్కలు చూపించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com