రైతుబిడ్డలా నటిస్తున్న మాస్క్ మ్యాన్ హరీష్.. కంటెంట్ కోసమేగా అంటూ నెటిజన్లు ట్రోల్స్!
on Sep 11, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 మొదలై నాలుగు రోజులు పూర్తి కాగా నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎవరేంటనేది బయటపడింది. కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీస్ గా ఈ సీజన్ ఆసక్తిగా సాగుతుంది.
పల్లవి ప్రశాంత్ అనగానే సీజన్-7లో రైతుబిడ్డ అంటు అతడి జర్నీనే గుర్తొస్తుంది. అతని ఫాలోయింగ్ అప్పుడు సంచలనం అయింది. నీ దగ్గర కంటెంట్ ఉంటే హోస్ట్ నాగార్జునే కాదు బిగ్‌బాస్ కూడా ఏం చేయలేడనేది వాస్తవం. ఈ విషయన్ని సీజన్-7లో అందరికి తెలిసేలా చేశాడు శివాజీ. ఆట ఆడకుండా పక్కన కూర్చున్నా.. బిగ్‌బాసా బొక్కా అని బూతులు తిట్టినా.. ఏం చేసినా కూడా శివాజీని బయటికి పంపించే ధైర్యం మాత్రం ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే ఆ సీజన్‌లో బిగ్‌బాస్ రేటింగ్‌కి ప్రధాన కారణం శివాజీ. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్-9లో అదే పని చేస్తున్నాడు మాస్క్‌మ్యాన్ హరీష్.
మాస్క్ మ్యాన్ హరీష్ అనగానే అందరు ఎవడ్రా వీడు అనుకున్నారు. అగ్నిపరీక్షలో హరీష్ మాటలకి జడ్జెస్ స్టన్ అయ్యారు. పెళ్లాంపై చేయి ఎత్తావా.. నువ్వు ఒక లూజర్.." అంటూ అగ్నిపరీక్ష మొదటి ఎపిసోడ్‌లోనే మాస్క్‌మ్యాన్ హరీష్‌ని ఏకిపారేసింది బింధు మాధవి. కానీ తన అభిప్రాయాన్ని మార్చుకొని తిరిగి అదే నోటితో హరీష్ పేరు ప్రకటించి హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా పంపించింది బింధు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విజయం. అయితే హరీష్ జర్నీ ఇక్కడితో ముగిసిపోలేదు ఇప్పుడే మొదలైంది. బిగ్‌బాస్ షోకి నేను ఒక భక్తుడ్ని అంటూ చాలాసార్లు చెప్పాడు హరీష్. ఇప్పటివరకూ జరిగిన ప్రతి సీజన్‌ని చాలా సార్లు చూశానని.. కూడా చెప్పాడు. ఆ ఏముందిలే అంతా ఊరికే చెబుతున్నాడని కొంతమంది అనుకొని ఉండొచ్చు కానీ బిగ్‌బాస్ సీజన్-9 మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ప్రతీ దాంట్లో ఆడియన్స్‌కి మాత్రం ఒక్క విషయం అర్థమైంది. కామనర్ల నుంచి కప్పు కోసం గట్టిగా నిలబడే కంటెస్టెంట్ మాస్క్‌మ్యాన్ హరీష్ అన్నది తొలి ఎపిసోడ్‌తోనే తేల్చేశాడు. హౌస్‌లో అసలు ఏం జరుగుతుందో తెలియని.. తెల్లముఖాలని ఒక ఆట ఆడుకుంటున్నాడు హరీష్. ఇక తనకి కాంపిటేషన్ అని అనుకున్నవాళ్లని ముందే సైలెంట్ చేసేలా పక్కాగా పనిలోకి దిగిపోయాడు.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో భరణితో గొడవకి దిగడం.. రెంటర్స్ ఆకలి అని వచ్చినప్పుడు సాయం చేసినట్టు నటించడం.. వాళ్లు అడగకపోయిన వెళ్లి ఏదో ఒకటి చేయడం.. ఇలా సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు మాస్క్ మ్యాన్ హరీష్.. ఫస్ట్ మాస్క్ పెట్టుకొని వచ్చినప్పుడే గెస్ చేయాల్సిందిరా నువ్వు మాస్క్ పెట్టుకొని గేమ్ ప్లే చేస్తున్నావంటూ హరీష్ పై నెట్టింట తెగ ట్రోల్స్ వస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



