Home

»

Tv News

BiggBoss 10 Telugu : ఓటింగ్‌లో దూసుకుపోతున్న ముఖేష్, త్రిగుణ్‌కి.. డేంజర్ జోన్‌లో శివ కుమార్, రామకృష్ణ!

Nov 11, 2026 9:02AM

 

బిగ్ బాస్ సీజన్-10 పదో వారం ఓటింగ్ పోల్‌లో ఊహించని ట్విస్ట్ కనిపిస్తోంది. హౌస్‌లో అందరూ నామినేషన్‌లో ఉండటంతో ఈ వారం ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. తాజా ఓటింగ్ ట్రెండ్ చూస్తే ముఖేష్ టాప్‌లో దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ వీక్ ఎమోషన్, బీబీ స్కూల్ టాస్క్‌లో ఫన్‌తో ముఖేష్ కి ఫ్యాన్స్ నుంచి భారీ సపోర్ట్ వస్తోంది. ఈ వారం ఓటింగ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని ముఖేష్ కైవసం చేసుకున్నాడు.

ఓటింగ్ లెక్కల్లోకి వెళ్తే ముఖేష్ 30.71% ఓట్లతో (27,447 ఓట్లు) మొదటి స్థానంలో ఉన్నాడు. అతడికి గట్టి పోటీ ఇస్తూ త్రిగుణ్ 29.03% ఓట్లతో (25,952 ఓట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 1.68% మాత్రమే. మూడో స్థానంలో దేబ్జానీ 11.08% ఓట్లతో (9,900 ఓట్లు) ఉంది. ఆ తర్వాత వర్షిణి 4.55% (4,070 ఓట్లు), అమన్ 4.21% (3,764 ఓట్లు), నీతూ 3.95% (3,531 ఓట్లు)తో ఉన్నారు. సుధీర్ 3.18% (2,844 ఓట్లు), నరేష్ 3.08% (2,752 ఓట్లు), రామ్ ప్రసాద్ 3.06% (2,734 ఓట్లు), శ్వేత 2.96% (2,642 ఓట్లు)తో దాదాపు ఒకే రేంజ్‌లో కొనసాగుతున్నారు.

డేంజర్ జోన్‌లో మాత్రం రామ కృష్ణ, శివ కుమార్ ఉన్నారు. రామ కృష్ణ 2.25% ఓట్లతో (2,010 ఓట్లు) 11వ స్థానంలో, శివ కుమార్ 1.94% ఓట్లతో (1,736 ఓట్లు) చివరి స్థానంలో ఉన్నారు. శివ కుమార్‌కి ఈ వారం చాలా కష్టంగా మారేలా కనిపిస్తోంది. గత వారాల్లో సైలెంట్‌గా ఉన్న శివ కుమార్‌కి ఫ్యామిలీ వీక్ కూడా పెద్దగా కలిసి రాలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇది అనధికారిక ఆన్‌లైన్ వోటింగ్ పోల్ మాత్రమే. అసలు జియో హాట్‌స్టార్ వోటింగ్‌తో పాటు మిస్డ్ కాల్ ఓట్లు కలిపితే లెక్క మారే ఛాన్స్ కూడా ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ముఖేష్, త్రిగుణ్ ఇద్దరూ సేఫ్ జోన్‌లో ఉన్నట్టే కనిపిస్తున్నా.. చివరి నిమిషంలో వోటింగ్ మారిపోవడం బిగ్ బాస్‌లో కామనే. శివ కుమార్, రామ కృష్ణ ఫ్యాన్స్ ఓటింగ్ వేస్తే వాళ్లు కూడా బయటపడే ఛాన్స్ ఉంది. ఈ వీకెండ్‌లో నాగార్జున ఎవరిని సేవ్ చేస్తాడు, ఎవరిని ఇంటి నుంచి పంపిస్తాడనేది చూడాలి మరి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com