
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 తొమ్మిదో వారం ముగిసి పదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త ట్విస్ట్ తీసుకొచ్చాడు. గత వారం హోటల్ టాస్క్, స్నేక్ అండ్ లాడర్ ఛాలెంజ్ తో రామ్ ప్రసాద్ ఏడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్ తో, వర్షిణి మూడు పింక్ స్టార్స్, ఒక గోల్డ్ స్టార్ తో గ్రీన్ లెవెల్ కు వెళ్లి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. ఇప్పుడు ఈ వారం కోసం బిగ్ బాస్ "Reward And Revenge" అనే కొత్త నామినేషన్ థీమ్ ను ప్లాన్ చేశాడు. దీని ప్రకారం గతంలో మంచి చేసిన వారికి రివార్డ్, చెడు చేసిన వారికి రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇవ్వనున్నారు. ఈ థీమ్ తోనే హౌస్ లో మళ్లీ గ్రూప్ గేమ్ మొదలైంది.
ఈ రివార్డ్ అండ్ రివెంజ్ నామినేషన్స్ లో హౌస్ మొత్తం రెండుగా చీలిపోయింది. ఒక వైపు ముఖేష్, సుధీర్, వర్షిణి శ్వేత గ్యాంగ్ ఉంటే, మరో వైపు త్రిగుణ్, వంశీ, రామ్ ప్రసాద్, నరేష్, నీతూ గ్యాంగ్ ఉన్నారు. గత వారం రోహిత్ ఎలిమినేషన్ తర్వాత రోహిత్ కు క్లోజ్ గా ఉన్న ముఖేష్ గ్యాంగ్ త్రిగుణ్ గ్యాంగ్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది.
ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్ లో వంశీ వర్సెస్ ముఖేష్ ఫైట్ హైలైట్ అయింది. ఝాన్సీ నిన్ను అన్నయ్య అని పిలిచింది, నీ వల్లే ఆ అమ్మాయి హౌస్ నుంచి బయటకు వెళ్ళిందంటూ ముఖేష్ పై వంశీ కామెంట్స్ చేశాడు. దానికి ముఖేష్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు రివెంజ్ థీమ్ తో ఇద్దరూ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అలాగే ముఖేష్ టాస్కుల్లో చూపిస్తున్న దూకుడుపై శ్వేత, శివ ఇప్పటికే ఫైర్ అయ్యారు. బంతి టాస్క్ లో కొట్టడానికి వచ్చినట్లు వస్తున్నాడని శ్వేత ఆరోపించింది. దీంతో ముఖేష్ పేరు ఈ వారం నామినేషన్ లిస్ట్ లో టాప్ లో ఉండబోతోంది.నీతూని ఆర్కే నామినేషన్ చేశాడు. వర్షిణిని నరేశ్ నామినేషన్ చేశాడు. ఇంకా నామినేషన్ ప్రక్రియ పూర్తవ్వలేదు. ఈ రివార్డ్ అండ్ రివెంజ్ థీమ్ వల్ల హౌస్ లో పాత కక్షలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. నీతూ, ఆర్కే మధ్య, శ్వేత, ముఖేష్ మధ్య, వర్షిణి, నరేష్ మధ్య జరిగిన గొడవలన్నీ ఇప్పుడు నామినేషన్స్ లో రివెంజ్ రూపంలో కనిపించబోతున్నాయి. ప్రస్తుతానికి అందుతున్న లీక్స్ ప్రకారం ఈ వారం నామినేషన్స్ లో ముఖేష్, వంశీ, శివ, సుధీర్, ఆర్కే, నరేష్, వర్షిణి ఉండే ఛాన్స్ ఉంది. అందులో రామ్ ప్రసాద్, వర్షిణి గత వారం స్టార్స్ వల్ల సేవ్ అయినా, ఈ వారం కొత్త థీమ్ లో వారు కూడా నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. అసలు ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో తేలనుంది.




.webp)

