Home

»

Tv News

బ్రహ్మముడి దీపికకు ఐ లవ్ యు చెప్పిన చెఫ్ జీవన్... ఇద్దరి మధ్య ప్రేమ పీక్స్

Nov 2, 2026 5:50PM

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ 6 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ఇక ఈ షోకి బ్రహ్మముడి కావ్య అలియాస్ దీపికా రంగరాజు వచ్చింది. ఈ ఎపిసోడ్ అంతా జిమ్ స్పెషల్ గా రాబోతోంది. దీపికా రావడమే జిమ్ జిమ్ తార అనే సాంగ్ పాడుకుంటూ వచ్చింది. ఆమెను చూసిన ఇమ్మానుయేల్ కౌంటర్ లు వేసాడు. "వస్తే వచ్చావ్ కానీ జిమ్ ఎపిసోడ్ కె రావాలా " అన్నాడు. "ఇంత పెద్ద పొట్ట పెట్టుకుని నువ్వు జిమ్ ఎపిసోడ్ కి వచ్చావు.  నేను రాకూడదా " అంటూ రివర్స్ కౌంటర్ వేసేసింది. ఇక తర్వాత చెఫ్ జీవన్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన్ని చూడగానే దీపికా తెగ సిగ్గుపడిపోయింది.

"నీకెలా తెలుసు ఆయన వస్తున్నారని " అంటూ సుమ దీపికను అడిగింది. "పిడుగు పడుతుందని చెట్టుకు ఎవరైనా చెప్పాలా.  జలుబొచ్చిందని ముక్కుకు ఎవరైనా చెప్పాలా " అని దీపికా అనేసరికి "ఇలాంటి సీన్ లు చూసాక ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా చెప్పాలా " అంటూ అంబటి అర్జున్ సెటైర్ వేసాడు. ఇక నందిని రెడ్డి ఐతే "జీవన్ చాలా జరిగినట్టు ఉన్నాయి " అనేసరికి దీపికా "ఇంకా ఏమీ జరగలేదు అందుకే మళ్ళీ మళ్ళీ ఇక్కడే తిరుగుతున్నాడు " అనేసింది. వెంటనే జీవన్ "నువ్వు ఊరుకోవే " అనేశాడు. ఇక ఎపిసోడ్ ఫైనల్ లో ఐతే జీవన్ స్టేజి మీదకు వచ్చి "హాయ్ దీపికా " అనేసరికి అటు తిరిగింది దీపికా. "ఏయ్ బిల్డప్ వద్దు గాని ఇటు తిరుగు " అన్నాడు. దాంతో దీపికా జీవన్ వైపు తిరిగింది. వెంటనే జీవన్ "రియల్లీ ఐ లవ్ యు సో మచ్ " అని చెప్పేసాడు. ఆ మాట వినేసరికి అందరూ షాకయ్యారు. ఇక దీపికా కూడా షాకై చెవులు మూసుకుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com