.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో.. సుధీర్, ముఖేష్ మధ్య గొడవ పీక్ కు చేరింది. తొమ్మిదవ వారం రివార్డ్ అండ్ రివేంజ్ టాస్క్ లో భాగంగా బస్తాల్లో థర్మకోల్ పెట్టి, 8 ఆకారంలో బ్యాగ్ కాపాడుకునే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ కు శివ్ సంచాలక్ గా వ్యవహరించాడు. వంశీ, నీతూ, దేబ్జానీ, ముఖేష్ మధ్య గట్టి పోరు జరిగింది. దేబ్జానీ ముఖేష్ బ్యాగ్ ను సగం ఖాళీ చేయించగా, దేబ్జానీ బ్యాగ్ కూడా ఖాళీ అయిపోయి పక్కకు వెళ్లి కూర్చుంది. అక్కడే సుధీర్, ముఖేష్ మధ్య మాట మాట పెరిగింది.
ముఖేష్ బ్యాగ్ లో తక్కువగా ఉందని, ఎలాగూ ఎలిమినేట్ అవుతాడు కదా అని సుధీర్ అమన్ తో అనడం ముఖేష్ కు కోపం తెప్పించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. నామినేషన్స్ లో ముఖేష్ మాట్లాడిన మాటలు, వర్షిణి వెనక నుంచి ప్రొవోక్ చేయడం సుధీర్ కు అస్సలు నచ్చలేదు. అంతకు ముందు నరేష్ తో.. ఎక్కువ మాట్లాడితే వాళ్ల వల్లే ఉన్నాను, నేనే సేవ్ చేశాను అంటారేమోనంటూ తన బాధను పంచుకున్నాడు సుధీర్. అలాగే నిన్నటి బస్తా టాస్క్ జరిగే ముందు సుధీర్ తో అన్నాడు ముఖేష్.
సాయం చేసి చెప్పుకుంటే నాకు అవసరం లేదు. నేను ముఖేష్ వల్లే ఉన్నాను అంటే, నాకు ఇష్టం లేదు. ఆడియన్స్ కు నచ్చకపోతే నన్ను ఎలిమినేట్ చేసేయండి అంటూ సుధీర్ ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేశాడు. గత వారం తక్కువ ఓట్లు వచ్చినా ముఖేష్ తన రెసరెక్షన్ పవర్ తో సుధీర్ ను కాపాడాడు. ఆ పవర్ వల్లే ఝాన్సీ ఎలిమినేట్ అయింది. అప్పటి నుంచి.. ముకేష్ వల్లే సుధీర్ ఉన్నాడనే మాట హౌస్ లో వినిపిస్తోంది. అదే మాట సుధీర్ ను బాగా హర్ట్ చేసింది. తన సొంత గేమ్ తోనే ఉన్నానని నిరూపించుకోవాలని సుధీర్ అనుకుంటున్నాడు.మొత్తానికి సుధీర్ అవుట్ బర్స్ట్ తో ముకేష్ గ్రూప్ పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది. సుధీర్ సెల్ఫ్ రెస్పెక్ట్ కరెక్టే అంటున్నారా లేదా అనేది తెలియాలి మరి.




.webp)
.webp)
