.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో రోహిత్ ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు అతను రీఎంట్రీ ఇస్తాడనే బజ్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే తాజాగా సీజన్-4 విన్నర్ అభిజిత్ చేసిన క్రిప్టిక్ ట్వీట్. అగ్నిపరీక్ష ద్వారా రోహిత్ ను బిగ్ బాస్ హౌస్ లోకి సెలెక్ట్ చేసింది అభిజితే. అభిజిత్ దగ్గర ట్రైనింగ్ తీసుకుని రోహిత్ హౌస్ లోకి వెళ్ళి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగాడు. ఆడియన్స్ ఓట్లలో టాప్ లో ఉన్న రోహిత్ హౌస్ మేట్స్ ఓట్లతో 8వ వారంలో బయటకు రావడంపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దీపావళికి రోహిత్ హౌస్ లోకి వస్తాడనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
దీనికి కారణం అభిజిత్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేశాడు. అది రోహిత్ ని ఉద్దేశించి చేశాడని తెలుస్తోంది. అది ఏంటంటే..The Sun Will Shine Again అని ట్వీట్ చేశాడు. పేరు ప్రస్తావించలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది రోహిత్ కోసమే అని ఫిక్స్ అయిపోయారు. ఈ ట్వీట్ కు ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేలాది మంది ఫ్యాన్స్ "Rohit Re-entry Ravali" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. "Anna, are these hints about Rohit's re-entry?" అంటూ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ కు అభిజిత్ గురువు లాంటి వాడు కావడం, అతని గేమ్ పై మొదటి నుంచి సపోర్ట్ గా ఉండటంతో ఈ ట్వీట్ కు మరింత ప్రాధాన్యత వచ్చింది. రోహిత్ రీఎంట్రీపై ఇలాంటి హింట్స్ వచ్చాయి. త్రిగుణ్ vs రోహిత్ రైవల్రీ సీజన్ కు హైలైట్ కావడంతో TRP కోసం మేకర్స్ రోహిత్ ను తిరిగి తీసుకొస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.ప్రస్తుతానికి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
హౌస్ లో త్రిగుణ్ డామినేషన్ ఎక్కువ అయింది. ముఖేష్ ఒక్కడే అతడిని ఏం చేయలేకపోతున్నాడు. నామినేషన్ లో కూడా రోహిత్ పగని నేను తీర్చుకుంటాను అని అన్నట్టుగా ముఖేష్ మాట్లాడడంతో త్రిగుణ్ తన మైండ్ మొత్తం ముఖేష్ ని ఓడించడంపై పెట్టాడు. సోషల్ మీడియాలో మాత్రం రోహిత్ రీఎంట్రీ ఇస్తే మాములుగా ఉండదు అంటూ రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ చేస్తున్నారు.




.webp)
.webp)
