Home

»

Tv News

Bigg Boss 10 Telugu: కులుకుడు గురించి చరణ్ మాట్లాడిన ఫుటేజ్ డిలీట్ చేసిన బిగ్ బాస్ టీమ్!

Nov 20, 2026 9:22AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో చరణ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి హౌస్‌లో రచ్చ మామూలుగా లేదు. డిక్టేటర్‌గా వచ్చిన చరణ్.. హౌస్‌మేట్స్‌ని ఎక్స్‌పైర్డ్ టాబ్లెట్స్ అంటూ సెటైర్లు వేశాడు. అయితే అసలు రచ్చ మాత్రం నాగార్జున కులుకుడు వ్యవహారంతోనే మొదలైంది.అసలు కులుకుడు ముచ్చట్లోకి వెళ్లాలంటే.. గతవారం బిగ్ బాస్ హౌస్‌లో ముఖేష్, వర్షిణిల వ్యవహారం గురించి చెప్పాలి. ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం ఇంటా బయటా ఉంది.

అదే విషయాన్ని ఒకానొక నామినేషన్స్‌లో ప్రస్తావిస్తూ.. ముఖేష్, వర్షిణిల గురించి దారుణంగా మాట్లాడాడు వంశీ. ఆ వారం ఝాన్సీ ఎలిమినేషన్‌కి ముఖేషే కారణమని వంశీ అన్నాడు. చెల్లి చెల్లి అంటూ ఝాన్సీని బయటకు పంపేసి.. అక్కడ కూర్చుని కులికారని చేతుల్ని పిసుకుతున్నట్టుగా యాక్టింగ్ చేసి చూపించాడు వంశీ. అయితే అతను మాట్లాడిన కులుకుడుపై అభ్యంతరం చెప్తూ.. కులకుతున్నామా? కులకడం అంటే ఏంటి అన్నా అని అడిగింది వర్షిణి. దాంతో వంశీ.. కులకడం అంటే నవ్వుకోవడం.. మా ఊళ్లో అలాగే అంటారు.. ఏ నీ దగ్గర వేరే అర్థం ఉందా అంటూ వంశీ అన్నాడు. కానీ అక్కడున్న వాళ్లందరికి ఆ కులకడం గురించి అర్థమైంది. చూసే వాళ్లకీ అర్థమైంది.కానీ వీకెండ్‌లో నాగార్జున వచ్చి.. వంశీ తాట తీస్తారని అంతా అనుకున్నారు. అయితే కులకడం అంటే అసలు తప్పు కాదు అంటూ కవరింగ్ ఇచ్చారు. కులకడం అంటే.. వయ్యారాలకు పోవడం.. నవ్వడం అంటూ కొత్త అర్థం ఇచ్చారు.

ఇదే పాయింట్‌ని చరణ్ హౌస్‌లోకి వచ్చాక డైరెక్ట్‌గా నామినేషన్ చేసే ముందు చెప్పాడు. నాగార్జున కులుకుడు అర్థంపై సెటైర్లు వేసి.. వంశీని ఎందుకు వదిలేశారు? వర్షిణికి, వంశీకి వేర్వేరు రూల్స్ ఎందుకు? అంటూ ప్రశ్నించాడు. చరణ్ మాటలు హౌస్‌మేట్స్‌ని షాక్‌కి గురి చేశాయి.అయితే ఈ మాటలని బిగ్ బాస్ టీమ్ డిలీట్ చేసిందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. చరణ్ నాగార్జునపై వేసిన డైరెక్ట్ సెటైర్లను ఎపిసోడ్‌లో పూర్తిగా చూపించలేదని, 24 గంటల లైవ్‌లో కనిపించిన కొన్ని బిట్స్‌ని తర్వాత తొలగించారని నెటిజన్లు అంటున్నారు. నాగార్జునను టార్గెట్ చేసినందుకే బిగ్ బాస్ టీమ్ ఆ క్లిప్‌లను డిలీట్ చేసిందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.మరి వీకెండ్‌లో నాగార్జున చరణ్‌పై ఫైర్ అవుతాడా.. కులుకుడు విషయంపై మాట్లాడతాడా చూడాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com