Home

»

Tv News

Godhavari :  జానూ పెళ్లిలో కొత్త చిక్కులు.. తోట రిజిస్ట్రేషన్ ఆగిపోవడానికి అసలు కారణం ఇదే!

Jun 2, 2026 11:07AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -19 లో.....శంకర్ బాధపడుతుంటే అప్పుడే తన దగ్గరికి మురళి వచ్చి.. తన కాళ్ళపై పడతాడు‌. మా అమ్మ తరుపున నేను క్షమాపణ అడుగుతున్నానని రిక్వెస్ట్ చేస్తాడు. ఇది బాగుంది.. మీ అమ్మ ఏమో ఇంటికి వస్తే తిట్టడాలు.. నువ్వేమో ఇంటికి వచ్చి బుజ్జగించడాలు అని నందు అంటుంది. ఆ తర్వాత నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి ఏర్పాట్లు చూసుకోవాలని శంకర్ అనగానే సరే మావయ్య అన్ని నేను చూసుకుంటాను. ఇలా ఎవరు పెళ్లి చెయ్యలేదు అనుకునేలా గ్రాంఢ్ గా నందు పెళ్లి చేద్దామని మురళి అంటాడు.

మరొకవైపు జానూను సూర్య గుర్తుచేసుకుంటాడు. తుఫాన్ తో మాట్లాడుతాడు. నాకు ఈ లోకంలో మా అమ్మ తర్వాత ఎవరైనా నచ్చారంటే అది జానూనే అని తుఫాన్ తో సూర్య అంటుంటే భువన విని షాక్ అవుతుంది. ఆ తర్వాత సూర్య దగ్గరికి భువన వచ్చి నువ్వు ఎప్పుడు ఒక మాట అంటావ్.. ఎప్పుడు అందరి కంటే ఎక్కువ నేనే ఇష్టమని అంటావ్ కదా.. ఎప్పుడు అలాగే ఉంటానని మాటివ్వు అని భువన అనగానే..... మాటిస్తున్నా అమ్మ ఈ లోకంలో అందరి కంటే ఎక్కువ ఎప్పుడు..  నువ్వే ఇష్టమని సూర్య చెప్పగానే భువన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మురళి ఇంటికి వెళ్తాడు. నువ్వు తప్పు చేశావ్ అమ్మ అని మురళి అంటాడు.  నువ్వు మీ తమ్ముడితో నా మేనకోడలిని నా కొడుకుకి చేసుకుంటానని ప్రతీసారి అనడం వల్లే మావయ్య మాటిచ్చాడు కానీ జానూని ఎప్పుడైనా అడిగావా.. మీరు మీరు అనుకుంటే ఎలా అని మురళి అంటాడు. ఇక మీదట ఆ ఇంటికి ఎప్పుడు వెళ్లొద్దు అలా అని మాటివ్వమని మురళిని శాంతి అడుగుతుంది.

నేను ఇవ్వను అమ్మా.. జానూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది.. నాకు మావయ్య.. నువ్వు ఇద్దరు కావాలి.. మావయ్య తన గుండెలపై నన్ను పెంచాడని మురళి అంటాడు. ఇప్పుడు నిన్ను ఒక మిషిన్ కుట్టుకునేవాడని చూస్తున్నారని మురళితో శాంతి అంటుంది. అలా ఏం కాదని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురళి. మరొకవైపు నాన్నకి అంత అవమానం జరిగింది.. దాని గురించి ఎవరు పట్టించుకోకుండా ఇంట్లో అందరు భోజనం చేస్తున్నారని జానూ అలుగుతుంది. దాంతో శంకర్ వచ్చి తనని బుజ్జగిస్తాడు. తరువాయి భాగంలో తోట రిజిస్ట్రేషన్ అయ్యేలా లేదు.. ఆ తోట అమ్మిన వ్యక్తి కోమాలో ఉన్నాడని శంకర్ తో సింహాద్రి అనగానే శంకర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com