ఈ వయసులో కిస్సులు, హగ్గులు ఏంటి రష్మీ...
on Jun 2, 2025
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో రామ్ ప్రసాద్ కిస్సులు, హగ్గులు అంటూ సరదాగా నవ్వించాడు. రాంప్రసాద్, దొరబాబు, శాంతిస్వరూప్ కలిసి ఒక స్కిట్ వేశారు. రాంప్రసాద్ కుర్చీలో ఊగుతూ దొరబాబుతో వార్తలు చదివించుకుంటూ ఉంటాడు. అందులో హెడ్ లైన్ గా "కిస్సులకు, హగ్గులకు ఒకే అన్న రష్మీ" అని చదువుతాడు. ఎవరైనా ఆ మాట వింటే సీరియస్ అవుతారు. కానీ రష్మీ మాత్రం సింపుల్ గా నవ్వుతూ "ఇది ఎప్పుడో అన్నాను నేను" అనేసరికి రాంప్రసాద్, దొరబాబు షాకై చూస్తూ ఉంటారు. "నీకు అభ్యంతరం లేకపోతే చూడడానికి మాకు ఉండాలి కదా అభ్యంతరం..ఈ వయసులో కిస్సులు, హగ్గులు బాగోవు కదా" అన్నాడు రాంప్రసాద్..ఆ మాటకు రష్మీ షాకయ్యింది.
ఆ తర్వాత బులెట్ భాస్కర్ స్కిట్ లో భాస్కర్ కూడా రష్మీ మీద సెటైర్స్ వేసాడు. స్కిట్ లో భాగంగా వర్ష భాస్కర్ ని పెళ్లి చేసుకోవాలి అంటే భాస్కర్ వెనక పెద్ద ఫామిలీ ఉండాలి అని చెప్తుంది. వెంటనే భాస్కర్ రష్మీకి ఫోన్ చేసాడు. "హలో రష్మీ గారు. చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు. నాకు అమ్మ క్యారక్టర్ లో చేయాలి చేస్తారా" అని అడిగాడు. వెంటనే రష్మీ "చెప్పు తీసుకుని కొడతా" అంది. ఇలా రాబోయే వారం జబర్దస్త్ లో స్కిట్స్ రష్మీ బేస్డ్ గా రష్మీని సెంట్రాఫ్ అట్రాక్షన్ గా చూపిస్తూ చేశారు. రీసెంట్ గా రష్మీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ని ఎదుర్కొంది. అలాగే పుట్టినరోజుకు వేరే ప్లేస్ కి వీల్ చైర్ లోనే వెళ్లి సెలెబ్రేట్ చేసుకుని మరీ తిరిగొచ్చింది. ఇక ఆమెతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్లి మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ పిక్స్ ని, వీడియోస్ ని రష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
