మహేష్ బాబుతో డేటింగ్ చేయాలని ఉంది..
on Jun 2, 2025
ఐశ్వర్య పిస్సే బుల్లితెర ముద్దబంతి. ఈ మధ్య కాలంలో ఎన్నో షోస్ లో కనిపిస్తోంది. ఐతే ఒక చిట్ చాట్ ఎపిసోడ్ ఆమె ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. అదేంటో తెలుసా.." "నేను కన్నడలో ఆర్కా మీడియా వాళ్లకు సీరియల్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఆర్కా మీడియాకి మంచి పేరుంది అలాగే పెద్ద ప్రొడక్షన్ హౌస్ కూడా దాంతో వాళ్ళే నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. నేను మొదట ఈటీవీలోనే నా పేరు మీనాక్షి సీరియల్ చేసాను. అలా వచ్చింది అవకాశం.
టాలీవుడ్ ఎప్పటికైనా నా క్రష్ మహేష్ బాబు...డేటింగ్ చేసే అవకాశం వస్తే మహేష్ బాబుతోనే డేటింగ్ చేస్తాను. కాలేజ్ లో నేను చేసిన క్రేజి థింగ్ నేను ఫస్ట్ పీరియడ్ కి అసలు వెళ్లేదాన్ని కాదు..నా కోసం వెయిట్ చేస్తూ నా ఫ్రెండ్స్ కూడా కాలేజీ బంక్ కొట్టేవాళ్ళు. అలా బంక్ కొట్టి సినిమాకు వెళ్లాం. సీరియల్స్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి సీరియల్స్ అంటే చాల ఇష్టం. అప్పుడప్పుడు టీవీ షోస్ కి కూడా వెళ్తూ ఉంటాను. నా లైఫ్ లో రిటర్న్ రావాలి అని అనుకోవడం లేదు.. అన్నీ కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఫ్యూచర్ లో మంచి పాపులర్ అవ్వాలి. అందరూ నన్ను పొగడాలి...నా యాక్టింగ్ ని అందరూ ఇష్టపడాలి. మైథలాజికల్ క్యారెక్టర్ చేయడం నా డ్రీం రోల్. నన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్ళను నిలబెట్టి మాట్లాడదామనుకుంటాను కానీ ఎప్పుడూ నిలదీయను. మూవీస్ చేయాలి అంటే లక్ ఉండాలి. అక్కడ లక్ దొరుకుతుందో లేదో తెలీదు కానీ సీరియల్స్ చేయడమే నాకు కంఫర్ట్ గా ఉంటుంది. నేను ఇక్కడ ఉండిపోతాను. తెలుగు, కన్నడ నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ వస్తే తెలుగులో ఎక్కువ ప్రాజెక్ట్స్ చేస్తున్నా కాబట్టి తెలుగునే ఎంచుకుంటాను. నేను మేకప్ చేసుకునేటప్పుడు కానీ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా అదే పనిగా చూస్తే మాత్రం వాళ్ళు ఎవరు అని కూడా చూడకుండా తిట్టేస్తాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో మాకు ఏమీ తెలిసేది కాదు. మేము ఎం చేయకపోయినా పెద్ద ఆర్టిస్టులను తిట్టలేక మమ్మల్ని తిట్టేవాళ్ళు ..ఆ విషయం చాల ఇబ్బందిగా అనిపించేది." అంటూ చెప్పుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
