Home

»

Tv News

Godhavari : వియ్యంకుడి కండిషన్‌తో శంకర్ షాక్.. సింహాద్రి మోసం బట్టబయలు!

Jun 3, 2026 11:00AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -20 లో.....జానూ అలిగిందని శంకర్ తనని బుజ్జగిస్తాడు. నాన్నని అత్త తిట్టిందని నాకు కోపంగానే ఉంది కానీ ఏం చేస్తాం. అత్తని కన్న ముసలిది ఇక్కడే ఉంది కదా.. దుప్పటి వేసి కొడుదామని నందు అనగానే సరే అలాగే చెయ్ నీ పెళ్లి ఆగిపోతుందని పెద్దావిడ అంటుంది. అబ్బో వద్దని నందు అనగానే అందరు నవ్వుకుంటారు. మరొకవైపు భువన పని మీద వారం రోజులు ఊరు వెళ్ళడానికి రెడీ అవుతుంది. సూర్యకి జాను దగ్గరికి వెళ్ళడానికి ఏ అడ్డు ఉండదని హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ బయటకు మాత్రం నువ్వు వెళ్తే నేను ఎలా ఉండాలని సూర్య యాక్టింగ్ చేస్తాడు.

సూర్య ఓవర్ యాక్టింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది.. మరీ ఉండిపోనా అని భువన అనగానే వద్దులే మమ్మీ రెడీ అయ్యావ్ కదా వెళ్ళు అని సూర్య తనని పంపిస్తాడు. మరుసటి రోజు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. మురళి, సూర్య అక్కడికి వెళ్తారు‌. బావ వచ్చాడు అని కిన్నెరా అనగానే నందు ఎక్సైట్ మెంట్ తో వస్తుంది. వచ్చింది అరవింద్ అనుకుంటుంది అక్కడ మురళిని చూసి నువ్వు అన్నది ఈ లేడీస్ టైలర్ మురళీనా.. ఇంకా నాకు కాబోయే ఆయన అనుకున్నానని నందు అంటుంది. దాంతో మురళి బాధపడుతాడు. అక్క నువ్వు ఎందుకు ఎప్పుడు బావ చేసే పనిని తక్కువ చూస్తావని జానూ కోప్పడుతుంది. మీరు పెళ్లికి సంబంధించిన ఏ పని ఉన్న మాకు చెప్పండి అని శంకర్ తో సూర్య అంటాడు. ఆ తర్వాత నందుని అందరు ఆశీర్వదిస్తారు.

సింహాద్రి తన భార్య వస్తారు.. ఇదిగో నందు మీ నాన్న కష్టపడి నగలు చేయించాడని నగలన్నీ నందుకి ఇస్తుంది సింహాద్రి భార్య. అవన్నీ చూసి నందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సింహాద్రిని శంకర్ బయటకు తీసుకొని వెళ్లి తోట రిజిస్ట్రేషన్ ఎక్కడ వరకు వచ్చిందని అడుగుతాడు. నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. తోట అమ్మిన అతను కోమాలో ఉన్నాడని సింహాద్రి చెప్పగానే శంకర్ షాక్ అవుతాడు. తరువాయి భాగంలో శంకర్ కి కాబోయే వియ్యంకుడు ఫోన్ చేసి తోట రిజిస్ట్రేషన్ పేపర్స్ మా వాడు పెళ్లి మండపానికి వెళ్లే కంటే ముందే కావాలని అంటాడు. ఆ తర్వాత అసలు సింహాద్రి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నాడని శంకర్ అనుకుంటాడు. ఆ తర్వాత సింహాద్రి తన ఫ్రెండ్స్ తో తోట నాది అని చెప్తుంటే శంకర్ విని సింహాద్రి అని గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com