Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్న అహంకారానికి సూరజ్ దిమ్మతిరిగే కౌంటర్.. మాలిని ఎంట్రీతో కొత్త ట్విస్ట్!

Jul 8, 2026 11:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -716 లో....దీప జ్యూస్ చేస్తుంటే ఇప్పుడు జ్యూస్ ఎందుకని కార్తీక్ అంటాడు. అమ్మతో మాట్లాడడానికి ఇదొక వంక అని దీప అంటుంది. సూరజ్ పై తాతకి ఎందుకు అనుమానం వచ్చిందని దీప అడుగుతుంది. అందరికి ఏమో గానీ నాక్కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మనకి తెలియదు కదా.. పైగా మన శత్రువుతో మాట్లాడుతూ కన్పించాడని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత సూరజ్ స్కూటీ క్లీన్ చేస్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చి లగేజ్ ప్యాక్ చేసుకున్నావా అని అడుగుతుంది.

నీకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చాను.. నువ్వు చెప్పకుండా వెళ్లిన ఇంట్లో ఎవరేం అనుకోరు.. అయినా ఎలా చెప్పి వెళ్తావ్ లే.. ఇంత అవమానం జరిగినాక అని సూరజ్ తో జ్యోత్స్న అంటుంది. హలో బంగారం.. ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని సూరజ్ అంటాడు. మా తాత నిన్ను కొట్టాడు కదా.. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తింటుంది కదా.. నువ్వు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవు కదా అని జ్యోత్స్న అంటుంది. నేను అభిమానానికి తలవంచుతాను.. ఏ పరిస్థితిలో జరిగిందో అదంతా చెప్పాను కదా అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత నిన్ను నా అర్ధంగిగా చేసుకోవాలి అనుకుంటున్నానని సూరజ్ అనగానే నీ స్థాయి అది కాదు.. రోడ్డుపై అరటి పళ్ళు అమ్ముకునే వాళ్ళు, ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు ఉంటే చూసుకమని సూరజ్ తో జ్యోత్స్న అంటుంది. నా వెనకల ఇంత ఆస్తి ఉంది.. మూడు తరాలు తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి.. నీకేమున్నాయని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ చైర్మన్ మాలిని ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ టీ తాగుతుంది. అక్కడ రెస్టారెంట్ బాగుంది.. అన్ని నచ్చాయి వెంటనే రెస్టారెంట్ ఓనర్ తో మాట్లాడాలని తన విజిటింగ్ కార్డు లోపలికి పంపిస్తుంది.

ఆ ఓనర్ విజిటింగ్ కార్డ్ చూసి షాక్ అవుతాడు. కాసేపటికి మాలిని లోపలికి వస్తుంది. నాకు ఈ రెస్టారెంట్ కావాలని అడుగుతుంది. అది జరగదని అతను చెప్తాను. మళ్ళీ నా విజిటింగ్ కార్డ్ తో నీకు పని ఉండొచ్చని మాలిని అనగానే ఆ అవసరం రాదని అతను డస్ట్ బిన్ లో వేస్తాడు. మరొకవైపు దీప దగ్గరికి సూరజ్ వచ్చి.. నాకు రెండు గంటలు పర్మిషన్ కావాలని అడుగుతాడు. అక్కడే అందరు ఉంటారు. నీకు ఎవరు లేరు అన్నావ్ కదా.. ఎవరిని కలవడానికి వెళ్తున్నావని కార్తీక్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com