Home

»

Tv News

Bigg Boss 10 Telugu:రామకృష్ణకి నీతూ వార్నింగ్.. నరేశ్ కి ఫ్యామిలీ వీక్ దక్కిందిగా!

Nov 9, 2026 8:46AM

బిగ్ బాస్ సీజన్-10  ఇంట్లో 9వ వారం గడిచింది. దీపావళి సందర్భంగా నో ఎలిమినేషన్ అని చివర్లో బంపర్ ఆఫర్ ఇచ్చారు. లేదంటే ఈ వారం సుధీర్ లేదా నీతూ ఎలిమినేట్ అయ్యేవారనిపిస్తోంది. ఇక పదో వారం ఫ్యామిలీ వీక్ అన్న సంగతి తెలిసిందే. వర్షిణి, నరేష్, రామకృష్ణలకు మాత్రమే ఫ్యామిలీ వీక్ మిస్ అయింది. ఇంట్లో మెజార్టీ సభ్యుల త్యాగాలతో నరేష్‌కి మాత్రం ఫ్యామిలీ వీక్ దక్కింది. ఆ టైంలో తన కోసం వస్తువులు ఎక్కువగా దానం చేయలేదని ముఖేష్ మీద వర్షిణి అలిగింది.

ఫస్ట్ వీక్ ఫైర్, నెక్ట్స్ వీక్ ఎక్స్‌పైర్ అని నీతూ గురించి వంశీ చెప్తాడు. రామకృష్ణ వచ్చి నీతూ గురించి చెప్తూ బిల్డప్ కొండంత.. పర్ఫామెన్స్ గోరంత అని అంటాడు. అది నీకు కూడా సెట్ అవుతుందని రామకృష్ణకి నాగార్జున కౌంటర్లు వేస్తాడు. సుధీర్ వచ్చి ప్రజెన్స్, పర్పస్ అని వర్షిణి గురించి చెప్తాడు. తేనే పూసిన కత్తి అని త్రిగుణ్ గురించి నీతూ చెప్తుంది. కెమెరా కోసమని శివ్ గురించి శ్వేత అంటుంది. సినిమా లేని పోస్టర్ అని రామకృష్ణ గురించి రామ్ ప్రసాద్, అమన్ అంటాడు. చివరకు సుధీర్ పేరుతో అమన్ ఓ సినిమా పేరు చెప్తాడు. ఈ టాస్క్ తర్వాత వర్షిణి సేఫ్ అని చెప్తాడు నాగార్జున.

నామినేషన్స్‌లో నేనే కనిపిస్తున్నా.. ఇక్కడ కూడా నా ఫోటోనే పెట్టాలా.. నేనే నీకు కనిపిస్తున్నానా.. నీకు రక్తకన్నీరు అంటే ఏంటో చూపిస్తానని రామకృష్ణని నీతు బెదిరిస్తుంటుంది. ఆ తర్వాత  రామకృష్ణ, వర్షిణి, నరేష్‌లకు ఫ్యామిలీ వీక్ రావడం లేదని, అయితే ఇంట్లోని సభ్యులు సపోర్ట్ చేస్తే ఆ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఫ్యామిలీ వస్తుందని నాగార్జున చెప్తాడు. వాళ్ల ముందున్న వెయింగ్ మిషిన్‌లో వస్తువులు వేయాలి.. వేసిన వస్తువులు మళ్లీ వెనక్కి రావు.. అని నాగార్జున అంటాడు. దీంతో నరేష్ కోసం అందరు ముందుకు వస్తారు. వర్షిణి కోసం ముఖేష్ ఎక్కువగా వస్తువులు వేస్తాడు. రామకృష్ణ కోసం అమన్ మాత్రమే వస్తువులు వేస్తాడు. అలా చివరకు నరేష్‌కి  ఫ్యామిలీ వీక్ దక్కుతుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com