Home

»

Exclusive Movie News

అందాన్ని ఎరగా వేసి ఆస్తి కొట్టేసిన ఆంటీ.!

Jul 23, 2026 11:53AM

తెలుగు సినీ ప్రేక్షకులను దశాబ్దాల పాటు తనదైన మార్కు హాస్యంతో అలరించిన దివంగత నటుడు వేణుమాధవ్, ప్రముఖ నటి ఉమాదేవి కాంబినేషన్‌లో వచ్చిన ఓ హాస్య సన్నివేశం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

'గుడ్ బాయ్' సినిమాలోని ఈ రొమాంటిక్ కామెడీ సీన్ లో వేణుమాధవ్ తన మార్కు టైమింగ్, నటనతో నవ్వుల పువ్వులు పూయించారు. కథలోకి వెళ్తే, వేణుమాధవ్ తనను తాను 'వేటూరి సుందర రామమూర్తి' అని పరిచయం చేసుకుంటూ, ఫ్లాష్‌బ్యాక్‌లో తన ప్రేమకథను ఎంతో ఆవేదనగా వివరిస్తారు.

గతంలో తను 'వరలక్ష్మి' (ఉమాదేవి) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడ్డానని వేణుమాధవ్ చెబుతారు. ఆ సన్నివేశంలో ఉమాదేవి వేణుమాధవ్‌ను టైమ్ ఎంత అని అడగ్గా, "12 గంటలు" అని ఆయన సమాధానమిస్తారు. దాంతో ఉమాదేవి "నాకు 12 ఏళ్లు ఉన్నప్పటి నుంచే పైట జారడం అలవాటు, అందుకే 12 అనగానే నా పైట జారుతుంది" అని అనడం వినోదాన్ని పంచుతుంది. ఆ మాట విన్న కేవలం నిమిషంన్నరలోనే తన మనసు కూడా జారిపోయిందని.. రోజూ పార్కులో వాచ్‌మెన్ కంటే ముందే వెళ్లి గేటు తీసి ఎల్లో బెంచ్ మీద కూర్చుని గంటల తరబడి ప్రేమించుకునేవాళ్లమని వేణుమాధవ్ గుర్తు చేసుకుంటారు. అలా కాలక్రమంలో తన వద్ద ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాయి. చివరకు పెళ్లి ప్రపోజల్ తెచ్చేసరికి ఆ అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి షాక్ ఇస్తుంది. పైగా వేణుమాధవ్ ఇచ్చిన బంగారం, ఉంగరాలు, గిఫ్ట్‌లన్నీ ఆమెకు కాబోయే భర్త వేసుకుని రావడంతో.. ఆ రోజు నుంచి తాను 'పిస్తా'గా మారినట్లు ఆయన కథ ముగిస్తారు.

ఈ క్రమంలోనే మరో సన్నివేశంలో.. హీరో రోహిత్ గ్యాంగ్‌కి, వేణుమాధవ్ గ్యాంగ్‌కి మధ్య జరిగిన గొడవ నవ్వులు పూయిస్తుంది. మొదట వేణుమాధవ్ "ఒక్కొక్కడు వచ్చినా, 100 మంది వచ్చినా, కలివిడిగా వచ్చినా, ఎవడు రాకపోయినా చిటికెలో నరికేస్తా" అని బిల్డప్ ఇస్తారు.

అయితే వెరైటీగా ఫైట్ చేద్దామని హీరో గ్యాంగ్ ప్రతిపాదిస్తూ, గిరి గీసి, అందరి కళ్లకు గంతలు కట్టుకుని కొట్టుకుందామని ప్లాన్ వేస్తారు. వేణుమాధవ్ "వన్, టూ, త్రీ" అనగానే కళ్లకు గంతలు కట్టుకున్న ఆయనను హీరో గ్యాంగ్ చితకబాదుతారు. తనను కొడుతుంటే వేణుమాధవ్ "అయ్యో.. అమ్మో" అని అరుస్తుండగా, వేరేవాడు దెబ్బలు తిని అరుస్తున్నాడని అనుకుని తన సొంత గ్యాంగ్ సభ్యులే పొరబడతారు. చివరికి కంటికి కట్టిన గంతలు విప్పి చూసేసరికి వేణుమాధవ్ ఒళ్లంతా దెబ్బలతో కిందపడిపోతారు. ఆ తర్వాత వేణుమాధవ్ ఏడుస్తూ తన మనుషులతో  "నన్ను కొడుతూ, నా నోరు నొక్కేసి వాడే అరిచాడు" అని చెప్పే తీరు నవ్వులు పూయిస్తుంది. 

 

 

Venu Madhav, Uma Devi, Romantic Comedy, Good Boy Movie, Telugu Comedy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com