Home

»

Exclusive Movie News

ఉదయ్ కిరణ్ సినిమాకి వచ్చిన లాభాలు.. మహేష్ బాబు మీద పెట్టాను.!

Aug 5, 2026 4:37PM

టాలీవుడ్ లో నిర్మాతగా ఎం.ఎస్. రాజు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన అందించిన సంచలన విజయాలు నేటికీ సినీ ప్రేమికుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన ‘ఒక్కడు’ సినిమా వెనుక ఉన్న అనేక ఆసక్తికరమైన విషయాలను, ఫైనాన్షియల్ రహస్యాలను తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎం.ఎస్. రాజు పంచుకున్నారు. ఒక్కడు సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లు, ఆ చిత్రానికి బడ్జెట్ ఎలా సమకూరింది అనే విషయాలపై ఎం.ఎస్. రాజు వెల్లడించిన నిజాలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

‘ఒక్కడు’ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి, చార్మినార్ సెట్ వంటి భారీ కాస్ట్లీ సెట్టింగ్స్ వేయడానికి ప్రధాన కారణం అంతకుముందు ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ‘మనసంతా నువ్వే’ సినిమా సృష్టించిన ప్రభంజనమేనని ఆయన తెలిపారు. ఆ సమయంలో 'మనసంతా నువ్వే' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెట్టిన బడ్జెట్‌కు ఏకంగా 14 రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమా అందించిన అపారమైన ఆర్థిక విజయం వల్ల తాము ఫైనాన్షియల్‌గా అత్యంత బలంగా మారామని, ఆ రోజుల్లో వచ్చిన ఆ భారీ లాభాల మొత్తాన్ని నేరుగా మహేష్ బాబు ‘ఒక్కడు’ చిత్రంపైనే ఖర్చు చేశానని ఎం.ఎస్. రాజు స్పష్టం చేశారు. ఎవరిపైనా ఎక్కువ ఫైనాన్స్ ఆధారపడకుండా సొంత డబ్బుతోనే చార్మినార్ సెట్ నిర్మించి సినిమాను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే 'ఒక్కడు' సినిమా విడుదల సమయంలోనూ బాక్సాఫీస్ వద్ద అనేక వ్యతిరేక పరిస్థితులు ఎదురయ్యాయని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పటికి మహేష్ బాబు నటించిన 'టక్కరి దొంగ', 'బాబీ' వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, అలాగే దర్శకుడు గుణశేఖర్ గత చిత్రాలు కూడా అనుకున్నంత సక్సెస్ సాధించకపోవడంతో పంపిణీదారులు సినిమాను కాస్త తక్కువ చేసి మాట్లాడారు. వారు అడిగిన తక్కువ రేట్లకు సినిమాను ఇవ్వడం ఇష్టం లేక.. ఎం.ఎస్. రాజు ఎంతో ధైర్యంగా ఆ చిత్రాన్ని సొంతంగానే విడుదల చేయడానికి పూనుకున్నారు. ఆ నమ్మకమే బాక్సాఫీస్ వద్ద నయా చరిత్రను సృష్టించి, ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.

ఈ సినిమా క్రియేటివ్ ప్రాసెస్, ఎడిటింగ్ రూమ్ సీక్రెట్స్, ప్రకాష్ రాజ్ కాస్టింగ్ విషయంలోనూ ఎం.ఎస్. రాజు ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. ప్రకాష్ రాజ్ డేట్స్ విషయంలో చిన్నపాటి వివాదం రాగా, వేరే నటుడితో రీషూట్ చేస్తానని తేల్చిచెప్పిన సందర్భంలో మహేష్ బాబు జోక్యం చేసుకుని సర్దిచెప్పారని తెలిపారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ లేకపోతే సినిమానే లేదని, ఆ తర్వాత వారిద్దరి మధ్య గొప్ప స్నేహం ఏర్పడిందని చెప్పారు. అంతేకాకుండా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర మొదట లేకపోయినా, ప్రత్యేకంగా డిజైన్ చేసి ఆయనతోనే చేపించానని ఎం.ఎస్. రాజు వివరించారు.

 

 

Producer MS Raju, Mahesh Babu, Okkadu Movie, Prakash Raj

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com