Home

»

Exclusive Movie News

Peddi: ‘పెద్ది’ సినిమాలో కుస్తీ ఎపిసోడ్ మీ ఊహలకి కూడా అందదు.. ‘బలగం’ సంజయ్ కామెంట్స్!

May 25, 2026 4:19PM

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi). గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న 'బలగం' ఫేమ్ సంజయ్ కృష్ణ, తెలుగువన్‌(TeluguOne)కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా రామ్‌చరణ్‌తో చేసిన హై-వోల్టేజ్ కుస్తీ ఫైట్ ఎపిసోడ్స్ గురించి పంచుకున్నారు. (Balagam Sanjay Krishna Interview)

ఈ సినిమాలో రామ్‌చరణ్ మేకోవర్, ఆయన బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని సంజయ్ కృష్ణ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అన్ని ఉన్నప్పటికీ, రామ్‌చరణ్ పడుతున్న కష్టం, చూపిస్తున్న డెడికేషన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. తన క్రేవింగ్స్ అన్నింటినీ చంపుకొని ఈ పాత్ర కోసం చరణ్ చేసిన హార్డ్ వర్క్, సాక్రిఫైస్ సినిమా స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు.

సినిమాలో వచ్చే కుస్తీ ఎపిసోడ్ గురించి సంజయ్ మాట్లాడుతూ, ఇది ప్రేక్షకుల ఊహలకు కూడా అందనంత అద్భుతంగా ఉంటుందని స్పష్టం చేశారు. మీరు ట్రైలర్ లో చూసింది ఒక్క శాతమే అని, సినిమాలో ఆ ఎపిసోడ్ అంతకు ఎన్నో రెట్లు ఉంటుందని చెప్పారు. 

ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒరిజినల్ కుస్తీ పహిల్వాన్లను రంగంలోకి దించారని, దానివల్ల ఫైట్స్ చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్‌గా వచ్చిందని చెప్పారు. అయితే రియల్ ఫైటర్స్ కావడంతో ఒక్కోసారి తెలియకుండానే ఎక్కువ ప్రెజర్ పెట్టేసేవారని, ఆ సమయంలో చరణ్‌కు ఎన్నో దెబ్బలు కూడా తగిలాయని సంజయ్ వెల్లడించారు. తాము కూడా సీన్ మూడ్‌లోకి వెళ్లి గట్టిగా పట్టుకున్నప్పుడు.. "సంజయ్ కూల్.. కూల్.. ఇట్స్ జస్ట్ యాక్టింగ్" అంటూ చరణ్ చాలా సరదాగా గైడ్ చేసేవారని గుర్తుచేసుకున్నారు.

ట్రైలర్, టీజర్‌లో కనిపించిన క్రికెట్ పిచ్ నుండి కుస్తీ మైదానంలోకి మారే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ షాట్ గురించి సంజయ్ కృష్ణ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాము సెట్స్‌లో రిహర్సల్స్ చేసి ఆ సీన్ చేశాం కానీ, స్క్రీన్ మీద అది అంత గొప్పగా వస్తుందని ఊహించలేదన్నారు. చరణ్ తనను గాలిలోకి లేపి తిప్పి పడేసే ఆ షాట్ కేవలం రెండో టేక్‌లోనే ఓకే అయిందని, షూట్ పూర్తయ్యాక తన టైమింగ్‌ను రామ్‌చరణ్ ప్రత్యేకంగా అభినందించారని సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. చరణ్ మెచ్చుకున్నారనే విషయం డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చి తనకు చెప్పినప్పుడు ఒక నటుడిగా గర్వంగా అనిపించిందని అన్నారు.

డైరెక్టర్ బుచ్చిబాబు వర్కింగ్ స్టైల్ గురించి చెప్తూ.. ఆయన బయట చాలా సైలెంట్‌గా కనిపిస్తారు కానీ, సెట్స్‌లోకి వస్తే మాత్రం వర్క్ పిచ్చోడిగా మారిపోతారని సంజయ్ అన్నారు. ప్రతి నటుడి దగ్గరకు వచ్చి డైలాగ్ మాడ్యులేషన్, హ్యాండ్ మూమెంట్స్ చాలా ప్రాపర్ గా బ్రీఫ్ చేస్తారని కొనియాడారు. ఈ సినిమాలో చరణ్‌తో పాటు కన్నడ లెజెండ్ శివరాజ్‌కుమార్ లాంటి పెద్ద పెద్ద నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని, ఒక బ్లెస్సింగ్‌లా భావిస్తున్నానని సంజయ్ చెప్పారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com