Home

»

Exclusive Movie News

60 మిలియ‌న్ వ్యూస్‌తో దూసుకెళ్తున్న 'వ‌ర్షం' సాంగ్ 'నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా'.!

Aug 26, 2026 5:38PM

ప్రభాస్, త్రిష, గోపీచంద్ ప్రధాన పాత్రల్లో శోభన్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ వర్షం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలన్నీ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాటిలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను చిత్ర ఎంతో హుషారుగా ఆల‌పించారు. దానికి త‌గ్గ‌ట్టుగానే త్రిష అంత‌కంటే హుషారుగా పెర్‌ఫార్మ్ చేశారు. ఈ సినిమా విడుద‌లై 22 సంవ‌త్స‌రాలు దాటిన‌ప్ప‌టికీ ఈ పాట‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. తెలుగు వ‌న్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో 11 సంవ‌త్స‌రాల క్రితం ఈ పాట‌ను అప్‌లోడ్ చేశారు. 60 మిలియ‌న్ వ్యూస్ సాధించి ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో ఉందంటే ఈ పాట‌ను ఎంత‌గా వీక్షిస్తున్నారో అర్థ‌మ‌వుతుంది. అందుకే ఈ పాట‌కు సంబంధించిన పూర్తి లిరిక్స్‌ను మీకోసం అందిస్తున్నాం. 

సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాన
సిలిపి నవ్వులో
సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాన
సిలిపి నవ్వులో

పంచ వన్నె చిలకలల్లే
వజ్రాల తునకలల్లే
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో

సినుకు రవ్వలో సినుకు రవ్వలో
సిన్నదాని సంబరాన
సిలిపి నవ్వులో

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావె చూసెళ్లి పోతావె
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యరా చేరదీసుకోనా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

తరికిట తరికిట తా

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాక్కుంటావే పైన

ముద్దులొలికే ముక్కు పుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు సన్న జూకాల్లాగా
చేరుకోవే జిలుగుల చుక్క

చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టిలాగా
మెడలో పచ్చల పతకంలాగా
వదలకు నిగ నిగ నగలను తొడిగేలా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

తరికిట తరికిట తా

చిన్న నాటి తాళీనైనా
నిన్ను నాలో దాచుకొనా
కన్నె యేటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకోనా

పెదవులు పాడే కిల కిల లోన
పదములు ఆడే కథకళి లోన
కనులను తడిపే కలతల లోన
నా అణువణువున నువ్వు కనిపించేలా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

తరికిట తరికిట తాా

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్లని దాక్కుంటావే పైన

చుట్టంలా వస్తావె చూసెళ్లి పోతావె
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యరా చేరదీసుకొనా

నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా

 

 

 

[NuvvostananteNenoddantanaaSongLyrics Varsham Kschitra, DevisriPrasad SirivennelaSeetharamaSastri TeluguSong TeluguOneDotCom]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com