
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్య నటులకు కొదవలేదు. అయితే కొన్ని కాంబినేషన్లు తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వులు ఆపుకోలేరు. అలాంటి అద్భుతమైన కాంబినేషన్లలో దివంగత నటుడు ఎంఎస్ నారాయణ, సీనియర్ నటి హేమల జంట ఒకటి. 'అందగాడు' చిత్రంలో వీరిద్దరూ కలసి పండించిన కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షక లోకాన్ని అమితంగా అలరిస్తున్నాయి.
హాస్య నటకిరీటి రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా తెరకెక్కిన 'అందగాడు' చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా విశేష ఆదరణ పొందింది. ఈ సినిమాలో ఎంఎస్ నారాయణ మార్క్ టైమింగ్, నటి హేమ సహజ నటన ప్రేక్షకులకు వినోదాల విందు అందించాయి.
తాగిన మైకంలో తన భార్య అలివేలు అనుకుని పక్క ఫ్లాట్ కు వెళ్లి.. హేమను హగ్ చేసుకొని, ఎంఎస్ నారాయణ చేసే రచ్చ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎంఎస్ నారాయణ తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో 'మూడ్ వచ్చేస్తుంది..' అంటూ చెప్పే సంభాషణలు, ఆయన పండించిన హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
కావాలని తాగిన మైకం పేరుతో హేమను హగ్ చేసుకుంటాడు. హేమ కేకలు వేయడంతో.. అందరూ వస్తారు. ఎంఎస్ నారాయణ భార్య కూడా వచ్చి, తిట్టుకుంటూ తీసుకువెళ్తుంది.
రెండోసారి కూడా ఎంఎస్ నారాయణ అలాగే హేమ కోసం వెళ్ళగా, ఈసారి ఆమె భర్త ఉండటంతో.. మత్తు ఎక్కువై పడిపోయినట్టు నటిస్తాడు.
మరోవైపు, తాగిన మైకంలో లేడీ ఇన్స్పెక్టర్‌ను తన భార్య అనుకుని ఆమె ముందు ఎంఎస్ నారాయణ చేసే హంగామా, ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో దెబ్బలు తినే సన్నివేశాలు అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్‌గా సాగుతాయి.
రీసెంట్ గా తెలుగువన్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలైన 'అందగాడు' సినిమాలోని ఈ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ వీడియో నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండటంతో అభిమానులు 'ఎంఎస్ నారాయణ కామెడీ టైమింగ్‌ని మరెవరూ రీప్లేస్ చేయలేరు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Andagadu Movie, Telugu Comedy Scenes, MS Narayana Comedy, Hema Comedy, Rajendra Prasad






