ఎన్.టి.రామారావు, సావిత్రి జంటగా కె.హేమాంబరధరరావు దర్శకత్వంలో పద్మనాభం నిర్మించిన చక్కని కుటుంబ కథా చిత్రం ‘దేవత’. 1965లో విడుదలైన ఈ సినిమా 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాలోని ఆణిముత్యాల్లాంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎస్.పి.కోదండపాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని అన్ని పాటలూ ఘనవిజయం సాధించాయి. ముఖ్యంగా శ్రీశ్రీ రచించిన ‘బొమ్మను చేసిన ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా..’ అనే పాటకు ఆరోజుల్లో విపరీతమైన ఆదరణ లభించింది. ఈ పాటలో ఘంటసాల గళం నుంచి వినిపించిన విషాదం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ పాట సాహిత్యాన్ని మీకోసం అందిస్తున్నాము.
బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరిగిపోయే..
తలచేది జరుగదూ జరిగేది తెలియదూ
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెలు కోసి నవ్వేవు ఈవింత చాలికా
బొమ్మను చేసీ ప్రాణము పోసి ఆడేవు నీకిది వే ...డుకా
అందాలు సృష్టించినావూ దయతో నీవూ మరలా నీచేతితో నీవె తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే గాడాంధకారాన విడిచేవులే
కొండంత ఆశా అడియాశ చేసి
కొండంత ఆశా అడియాశ చేసి
పాతాళలోకాల తోసేవులే ...
బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా
ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగమధువు అందించి నీవూ
హాలాహలజ్వాల చేసేవులే .
ఆనందనౌకా పయనించువేళా
ఆనందనౌకా పయనించువేళా శోకాల సంద్రాల ముంచేవులే
బొమ్మను చేసీ . ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా .ఆ..
గారడి చేసీ . గుండెలు కోసి . నవ్వేవు ఈవింత చాలిక.
బొమ్మను చేసి .ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా..
[Bommanu chesi pranamu posi song lyrics, devatha movie songs, ghantasala, sp kodandapani, padmanabham]




