
'ఒక్క రోజు ముఖ్యమంత్రి' అనే వినూత్నమైన, మైండ్ బ్లాస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన శంకర్ దర్శకత్వపు ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం 'ఒకే ఒక్కడు' సృష్టించిన ప్రభంజనం ఎప్పటికీ మరచిపోలేనిది. యాక్షన్ కింగ్ అర్జున్ నటన, శంకర్ టేకింగ్, రఘువరన్ నభూతో నభవిష్యత్ డైలాగ్ వార్ ప్రేక్షకుల గుండెల్లో బలమైన ముద్ర వేసాయి.
విడుదలైన ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమాలోని సన్నివేశాలకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. తాజాగా ఈ మాస్టర్‌పీస్ మూవీకి సంబంధించిన ఒక పవర్ ఫుల్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్క రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక సామాన్య రిపోర్టర్, సమాజంలోని మూలమూలలా పేరుకుపోయిన అవినీతిపై ఎలాంటి సమర శంఖం పూరించాడో ఈ క్లిప్‌లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అవినీతికి పాల్పడిన 12 మంది మంత్రులను ఆధారాలతో సహా అరెస్ట్ చేయడానికి ఆదేశాలు ఇచ్చే ఘట్టం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కారంటూ నాటి ముఖ్యమంత్రి రఘువరన్ ఎదురుగా నిలబడి అర్జున్ వార్నింగ్ ఇచ్చే తీరు ప్రతీ సినిమా అభిమానికి పూనకాలు తెప్పిస్తుంది.
ఈ సన్నివేశంలో అర్జున్ ఒక్కో అవినీతి తిమింగలాన్ని వేటాడే ధైర్యం, రఘువరన్ చూపించే నటనలోని వైవిధ్యం, ఇద్దరి మధ్య సాగే సంభాషణలు సీన్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. "ఒక్క రోజు సీఎం పదవి పూర్తవడానికి ఇంకా సరిగ్గా 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది.. చివరిగా నేను చేయాల్సిన బాధ్యత ఒకటి మిగిలి ఉంది" అంటూ సీఎం స్థానంలో ఉన్న రఘువరన్‌నే అరెస్ట్ చేస్తున్నట్లు అర్జున్ ప్రకటించే ట్విస్ట్ థ్రిల్లింగ్ పీక్స్‌కు చేరుస్తుంది. "నన్ను అరెస్ట్ చేయడానికి గవర్నర్ సంతకం, సుప్రీంకోర్టు ఉత్తర్వులు కావాలి" అని రఘువరన్ గర్జించగా, "ప్రస్తుతానికి మీరే సాధారణ వ్యక్తి.. నేనే సీఎం, మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం నాకుంది" అని అర్జున్ తిప్పికొట్టే డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయి.
రాజకీయ నాయకుల అక్రమాలను ప్రశ్నించే నాయకుడు ఉంటే సమాజం ఎలా మారుతుందో చెప్పిన ఈ పవర్‌ఫుల్ సీన్ నేటి యువతను, సినిమా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్ పొలిటికల్ మాస్ సీన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది.
Oke Okkadu, Arjun, One Day CM, Raghuvaran





