Home

»

Exclusive Movie News

ANR ‘దొంగరాముడు’ సినిమా అఖిల్‌కి ఎందుకంత ఇష్టం?

Jul 7, 2026 3:02PM

అక్కినేని నటవారసుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), తన కెరియర్‌లో ఒక బలమైన సక్సెస్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. త్వరలోనే 'లెనిన్' (Lenin) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆయన తాతగారు, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ మూవీ 'దొంగరాముడు' (Donga Ramudu)పై చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

తన తాతగారి సినిమాల్లో తనకు అత్యంత ఇష్టమైన చిత్రం 'దొంగరాముడు' అని అఖిల్ వెల్లడించారు. సాధారణంగా ఏఎన్నార్ అనగానే చాలామంది 'దేవదాసు' వంటి క్లాసిక్ లవ్ స్టోరీల పేర్లు చెబుతారు. కానీ, అఖిల్ మాత్రం ఈ వింటేజ్ కమర్షియల్ డ్రామాను ఎంచుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉంది.

అఖిల్ ఈ సినిమాను ఇష్టపడటం వెనుక ఆయన నటుడిగా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారనే క్లారిటీ కనిపిస్తోంది. 'దొంగరాముడు' క్యారెక్టర్‌లో పైకి చాలా జోవియల్‌గా కనిపిస్తూనే.. లోపల ఒక అండర్ కరెంట్ పెయిన్ (బాధ), సమాజంపై ఒక అగ్రెషన్ ఉంటాయి. ఎన్ని లేయర్స్ ఉన్నా కథను నడిపించే సూత్రధారి ఆ పాత్రే.

నిజానికి 'దొంగరాముడు' చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా. దీనిని లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా కోసం ఏఎన్నార్ ఏకంగా మూడేళ్లు ఎదురుచూశారట. 

అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు అనగానే ఎక్కువగా దేవదాసు వంటి విషాద పాత్రలు లేదా సాఫ్ట్ రోల్స్ గుర్తుకొచ్చేవి. అయితే ఆయనలోని మాస్ యాంగిల్‌ను, కమర్షియల్ యాక్టింగ్ టైమింగ్‌ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘దొంగ రాముడు’. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్, ఎమోషన్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. ANR నటన, సావిత్రి, జమునల అద్భుతమైన ప్రదర్శన ఈ సినిమాను గొప్పగా నిలిపాయి.

అఖిల్ 'లెనిన్' సినిమాలో కూడా ఇలాంటి ఒక ఇంటెన్స్, అండర్ కరెంట్ పెయిన్ ఉన్న క్యారెక్టరైజేషన్ కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాతగారిలాగే తను కూడా ఒక పవర్‌ఫుల్ మాస్ హీరోగా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వాలనే బలమైన కోరిక అఖిల్‌లో ఉందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

మరి అఖిల్ ఇంట్రెస్ట్‌ను గమనించి నాగార్జున, తన కొడుకు కోసం 'దొంగరాముడు' తరహాలోనే వైవిధ్యమైన, ఎమోషనల్ యాక్షన్ స్క్రిప్ట్‌ను డిజైన్ చేయిస్తారేమో చూడాలి. అక్కినేని అభిమానులు కూడా అఖిల్ నుంచి ఇలాంటి ఒక క్లాసిక్ మాస్ క్యారెక్టర్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

 

Akhil Akkineni, Lenin Movie, ANR, Donga Ramudu, TeluguOne

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com