Home

»

Exclusive Movie News

'అబ్బాయిగారు' ఎమోషనల్ సీన్: నన్ను నిజమైన అమ్మని చేశావు.. నువ్వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు.!

Aug 24, 2026 2:46PM

ఆప్యాయతలు, అనురాగాలు, మాతృప్రేమ నేపథ్యంగా తెరకెక్కిన క్లాసిక్ చిత్రాల్లో 'అబ్బాయిగారు' శైలి ప్రత్యేకం. విక్టరీ వెంకటేష్, మీనా, జయచిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ చిత్రంలోని వచ్చే తల్లి సెంటిమెంట్ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తాయి.

తెలుగు సినిమాలో వెంకటేష్ కెరీర్‌ను ఒక్కసారి పరిశీలిస్తే, ఆయన నటించిన సెంటిమెంట్ డ్రామాలు ఎన్నో రికార్డులను సృష్టించాయి. అందులోనూ 'అబ్బాయిగారు' సినిమాలో వెంకటేష్ కనబరిచిన నటన, పండించిన భావోద్వేగాలు సగటు ప్రేక్షకుని గుండెలను తాకుతాయి. కన్నతల్లి ప్రేమకు నోచుకోని హీరో, మారుతల్లిని కన్నతల్లికంటే ఎక్కువగా ఆరాధించే తీరు ప్రతి ఒక్కరినీ మైమరపిస్తుంది. కానీ, మారుతల్లి మాత్రం పైకి మంచిగా నటిస్తూ, మనసులో విషాన్ని నింపుకుంటుంది. చివరికి ఆమెలో మార్పు వస్తుంది.

ఈ సన్నివేశంలో వెంకటేష్ పాత్ర పడే ఆవేదన, తల్లిపై ఉన్న భక్తి, అనురాగాన్ని ఎంతో గొప్పగా ఆవిష్కరించారు. "పుట్టగానే ఒక అమ్మను పోగొట్టుకున్నాను, ఇప్పుడు నీకూ దూరమవుతున్నాను.. అందరిలా అమ్మతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదనుకుంటా" అని వెంకటేష్ చెప్పే సంభాషణలు ప్రేక్షకుల మనసులను పిండేస్తాయి. తల్లికి ఆసరాగా ఉండేందుకు తన ఆస్తులన్నింటినీ ఆమె పేరిట రాసిస్తూ దండం పెట్టే ఆ ఘట్టం ప్రతి ఒక్కరికి కన్నీళ్లు  తెప్పిస్తుంది.

దీనికి సమాధానంగా "అమ్మ అన్న మాటకి అర్థం చెప్పి, నన్ను నిజమైన అమ్మని చేసిన నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతకలేదు బాబు" అంటూ నటి జయచిత్ర పలికే సంభాషణలు, ఆమె కళ్లలోని ఆవేదన ఈ సన్నివేశానికి ప్రాణం పోశాయి. ఒక తల్లికి, కొడుక్కి మధ్య ఉన్న అపారమైన అనుబంధాన్ని దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఎంతో గొప్పగా మలిచారు.

జయచిత్ర అద్భుతమైన నటనకు తోడు, వెంకటేష్ కనబరిచిన అమాయకత్వం, నిష్కల్మషమైన ప్రేమ ఈ సీన్‌ను తెలుగు సినీ చరిత్రలోనే ఒక ఐకానిక్ మదర్ సెంటిమెంట్ సీన్‌గా నిలబెట్టాయి. నేటికీ ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.

 

 

 

Abbaigaru Movie, Mother Sentiment, Venkatesh, Jayachitra

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com