Home

»

Latest News

యంగ్‌టైగర్‌ ఫస్ట్ హిట్‌కి పదిహేనేళ్లు...

Sep 28, 2016 10:51AM

అచ్చుగుద్దినట్టు అన్నగారి పోలికలతో..నందమూరి మూడో తరం హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో అంచనాల మధ్య నిన్నుచూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్..ఈ సమయంలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూస్తున్న టైంలో రాజమౌళి రూపంలో అదృష్టం తలుపు తట్టింది.  అప్పటికి శాంతినివాసం సీరియల్ డైరెక్ట్ చేసి..దర్శకుడిగా తన తొలి సినిమాను కూడా గురువు పర్యవేక్షణలోనే  మొదలుపెట్టాడు జక్కన్న.

ఆ చిత్రమే స్టూడెంట్ నెం.1, సినిమా సెట్స్ పైకి వెళ్లినపుడు అసలు ఈ కాంభినేషన్‌పై పెద్ద అంచనాల్లేవు. అయితే కీరవాణి ఆడియో అదిరిపోవడంతో సినిమాకు కాస్త పబ్లిసిటీ వచ్చింది. సినిమా పర్వాలేదు అన్న టాక్‌తో నెమ్మదిగా పుంజుకున్న స్టూడెంట్ నెం.1 ఆ తర్వాత తెలుగునాట సంచలనం సృష్టించి సూపర్‌ హిట్టయింది. అలా తొలిసారిగా సక్సెస్ రుచి చూసి ఇక వెనుదిరిగి చూసుకోలేదు జూనియర్. ఈ సినిమా రిలీజై పదిహేనేళ్లవుతున్న సందర్భంగా యంగ్‌టైగర్‌తో పాటు ఆ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com