Home

»

Latest News

స్వప్నసుందరికి చెప్పు దెబ్బలు..!

Sep 27, 2016 6:02PM

రేఖ..ఈమె ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. కాని ఇప్పుడు 50 ప్లస్‌లో రన్ అవుతున్న మగధీరులకు ఈమె అప్పట్లో స్వప్నసుందరి. రెయిన్ డ్యాన్సు‌లకు పెట్టింది పేరైన రేఖ ఎందరో హీరోలతో ఆన్‌ స్క్రీన్ రోమాన్స్ చేసి బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపింది. ఈ దశలో లవ్ ఎఫైర్లతో నిత్యం వార్తల్లో ఉండేవారు రేఖ. అప్పట్లో రేఖ వ్యక్తిగత జీవితం గురించి రకరకాల కథనాలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె పెళ్లికి సంబంధించి ఎన్నో సంచలనాలున్నాయి. అలాంటి విషయాలను బయటపెడుతూ యాస్మిన్ ఉస్మాన్ "రేఖ..ద అన్ టోల్డ్ స్టోరీ" పేరిట రేఖ ఆత్మకథను రాశారు.

దీనిలో ఆమె పెళ్లికి సంబంధించిన ఆశ్చర్యకరమైన సంఘటనలున్నాయి. వినోద్ మెహ్రాను పెళ్లి చేసుకున్న రేఖకు అత్తగారింట్లో అడుగుపెట్టే సమయంలో ఘోర అవమానం జరిగింది. వినోద్ తల్లికి రేఖను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. దీంతో పెళ్లి చేసుకుని గుమ్మం ముందుకొచ్చి నిలబడి రేఖను నానా మాటలు అనడమే కాకుండా చివరికి చెప్పుతో కొట్టి మరీ రేఖను తన ఇంటి నుంచి వెళ్లగొట్టిందట. దీనితో పాటు రేఖ-అమితాబ్‌ల ప్రేమ, రేఖ చీత్కారాలు, సత్కారాలు బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో వాస్తవాలు ఈ పుస్తకం ద్వారా బాలీవుడ్‌లో సంచలనం కలిగిస్తున్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com