Home

»

Latest News

Toxic: యష్ సంచలన ట్వీట్..టాక్సిక్ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసాం

Jun 30, 2026 6:13PM

 

 

 

యష్(yash)వన్ మాన్ షో టాక్సిక్(Toxic)కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, మూవీ లవర్స్, ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురుచూస్తున్నారు.  ఆ ఎదురుచూపులతో పాటు కియారా అద్వానీ తో పాటు ఇతర హీరోయిన్స్ ఎవరున్నారో అనే ఆసక్తి కూడా వాళ్ళందరిలో ఉంది. ఈ విషయంపై యష్ రీసెంట్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు.


సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ "యాదృచ్ఛికంగా మా లేడీస్ ఎక్కడ ఉన్నారు యష్?" అంటూ ఒక సరదా పోస్ట్ పెట్టింది. దీనికి  యష్ తనదైన స్టైల్‌లో  స్పందిస్తూ.. "కామ్ డౌన్! లేడీస్ రావడానికి కాస్త సమయం పడుతుంది! రేపు జులై 1, 2026 ఉదయం 11:33 గంటలకు చూద్దాం" అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రేజీ అప్‌డేట్‌తో 'టాక్సిక్' చిత్రంలో నటిస్తున్న లీడ్ యాక్ట్రెసెస్‌పై ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది. రేపు ఉదయం విడుదల కాబోయే ప్రత్యేక టీజర్ లేదా గ్లింప్స్ ద్వారా ఈ సినిమాలో నటించే పవర్‌హౌస్ ఫీమేల్ కాస్ట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు.


Also read: Allu Arjun: అల్లు అర్జున్ నా క్రష్.. మీ స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ 'నాడియా' అనే ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తుండగా, లేడీ సూపర్ స్టార్ నయనతార 'గంగ' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. వీరితో పాటు హుమా ఖురేషి 'ఎలిజబెత్' గా, తారా సుతారియా 'రెబెక్కా' గా, కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ 'మెలిస్సా' అనే వైవిధ్యమైన పాత్రల్లో మెరవనున్నారు. డ్రగ్ మాఫియా మరియు గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మహిళా దర్శకురాలి పర్స్పెక్టివ్ (ఫిమేల్ గేజ్) ఎలా ఉండబోతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆగస్టు 26 రిలీజ్ డేట్.

 



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com