Home

»

Latest News

Toxic: యష్ ‘టాక్సిక్’ మూవీ నుండి క్రేజీ గ్లింప్స్ రిలీజ్.. ఆ 63 సెకన్లు పూనకాలే!

Jun 8, 2026 12:41PM

కన్నడ పరిశ్రమ రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన 'కేజీఎఫ్' స్టార్, రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న తాజా మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' (Toxic). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా జూన్ 8న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఒక అదిరిపోయే బిగ్ సర్ప్రైజ్‌ను అభిమానుల ముందుకు తీసుకువచ్చింది. సినిమా సెట్స్ నుండి సరికొత్త బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోను విడుదల చేస్తూ మేకర్స్ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతూ సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చుతోంది.

చిత్రబృందం విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో మొత్తం 63 సెకన్ల నిడివితో సాగింది. భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించిన ఒక గ్రాండ్ చర్చ్ సెట్‌లో కీలక సీన్స్ చిత్రీకరించినట్లు ఈ గ్లింప్స్‌ తో స్పష్టమవుతోంది. ఈ వీడియోలో గీతూ మోహన్ దాస్ ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను ఎంతో ఇంటెన్సిటీతో, ఎమోషనల్‌గా డైరెక్ట్ చేస్తున్న విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా కథా నేపథ్యం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 1940 - 1970 మధ్య గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారం, మాఫియా సామ్రాజ్యం చుట్టూ ఈ యాక్షన్ థ్రిల్లర్ తిరగనుంది. ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామా కోసం మేకర్స్ ఏకంగా రూ. 800 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించడం విశేషం. ఇంతటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ రెండు విభిన్నమైన పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. ఈ చిత్రంలో యష్ సరసన బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా, మరో కీలకమైన రోల్‌లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది.

అంతర్జాతీయ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్‌కు చెందిన టాప్ స్టంట్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దించారు. వారి పర్యవేక్షణలోనే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో నేరుగా షూట్ చేస్తుండగా, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లోకి భారీగా డబ్ చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

గతంలో కొన్ని అనివార్య కారణాలు మరియు డేట్స్ అడ్జస్ట్‌మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యమైనప్పటికీ, ఇప్పుడు ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ రూ. 800 కోట్ల భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను డిసెంబర్ 2026 లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com